Hair Mask : నిమ్మతో హెయిర్ మాస్క్ ఇలా చేసుకోండి

* బౌల్‌లో టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్ తీసుకుని అందులో జుట్టుకు వేసుకునేట్లు పేస్ట్‌లా కలపాలి. ఇందులోకి ఒక కోడిగుడ్లు సొన వేయాలి. సగం నిమ్మకాయను కోసి ఆ రసాన్ని పిండాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు మాస్క్‌లా వేసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా ఉంటుంది.
* టేబుల్ స్పూన్ నిమ్మరసం, నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే తలమీద చల్లగా ఉంటుంది.
* రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నీళ్లు కలపాలి. బాగా కలిపిన తర్వాత ఈ నీళ్లను జుట్టు మాడుకు తగిలేట్లు పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల జుట్టు మృదువుగా ఉంటుంది.
* బౌల్‌లో టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి కలపాలి. దీన్ని జుట్టుకు పట్లేట్టు పట్టించి ఆరిన తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రపరచుకోవాలి. దీనివల్ల జుట్టు పెరుగుతుంది.
* రెండు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్‌లోకి.. టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల జుట్టులోని ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి.
* జుట్టులో చుండ్రు పోవాలంటే కేవలం నిమ్మరసం పట్టించుకున్నా చాలు. దీంతో పాటు సిట్రస్ వల్ల జుట్టులో మంట వచ్చినట్లు కొందరికి ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు పోతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com