Male Menopause : మగవారిలో కూడా మెనోపాజ్.. సంతానోత్పత్తిపై ప్రభావం..

Male Menopause : మెనోపాజ్ మహిళల్లోనే వస్తుందనుకుంటాము. కానీ మగవారు కూడా మెనోపాజ్‌కి గురవుతారని వైద్యులు పేర్కొంటున్నారు. దీనిని వైద్య పరిభాషలో ఆండ్రోపాజ్ అంటారు. ఒక వ్యక్తికి 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, అతని టెస్టోస్టెరాన్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. ప్రతి సంవత్సరం సగటున ఒక శాతం తగ్గుతుంది.
వయస్సు పెరుగుతున్న మహిళల్లో రుతుక్రమం ఆగిపోతుంది. దాన్నే మెనోపాజ్ అంటారు. స్త్రీత్వాన్ని దూరం చేస్తుందని భావిస్తున్న కొంత మంది పాశ్చాత్య దేశాల మహిళలు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT)ని ఎంచుకుంటారు.
పురుషుల మెనోపాజ్‌కు కూడా HRT చికిత్స ఉంది. అయితేపురుషులు మెనోపాజ్‌ను అధిగమించడానికి జీవనశైలి మార్పుపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. HRT ట్రీట్‌మెంట్‌కి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
పురుషులలో మెనోపాజ్ కారణంగా లైంగిక కోరిక సన్నగిల్లుతుంది. డాక్టర్ కిషోర్ సూచన మేరకు క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతి రాత్రి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమించాలి. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
"మొత్తంమీద, జీవనశైలి మార్పుతో పాటు ఆహార మార్పులు చేసుకోవడం ద్వారా మగవారిలో వచ్చే మెనోపాజ్‌ని కొంత వరకు తగ్గించవచ్చని వైద్యులు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా చికిత్సలను ఎంచుకునే ముందు అనుభవం, అర్హత ఉన్న వైద్యులు మాత్రమే సంప్రదించాలని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com