ప్రేయసి గురక ఆపడానికి ప్రియుడు ఏం చేశాడంటే..

ప్రేయసి గురక ఆపడానికి ప్రియుడు ఏం చేశాడంటే..
ప్రేయసి గురక ఆపడానికి ప్రియుడు ఏం చేశాడంటే.. గురక పెట్టె వ్యక్తి పక్కన పడుకోవడం సహనానికి నిజమైన పరీక్ష. అటువంటి వాళ్ళు పక్కనే ఉంటే వారిని తన్నడం లేదా కదిలించడం చేస్తుంటారు..

గురక పెట్టె వ్యక్తి పక్కన పడుకోవడం సహనానికి నిజమైన పరీక్ష. అటువంటి వాళ్ళు పక్కనే ఉంటే వారిని తన్నడం లేదా కదిలించడం చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రేయసి నుండి వచ్చే గురక ఆపడానికి ఒక విచిత్ర ఉపాయాన్ని కనుగొన్నాడు. గత ఏడు నెలలుగా జాసన్ గ్రాహం తన ప్రేయసి షార్నీతో కలిసి ఉంటున్నాడు. అయితే ఆమె రాత్రుళ్ళు నిద్రించేటప్పుడు విపరీతంగా గురకపెడుతోంది. దీంతో నిద్ర పట్టక జాసన్ గ్రాహం ఇబ్బందిపడేవాడు. ఆమె గురక ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.. ఎన్ని చేసినా ఆగలేదు. దాంతో అలాగే ఉండిపోయాడు.. అయితే ఒకరోజు తన ప్రియురాలు

ముఖాన్ని నాకినప్పుడు ఆమె ఒక్కసారిగా గురక ఆపిందట. దీంతో అప్పటి నుంచి ఈ ట్రిక్‌ను ఆమెపై ప్రయోగిస్తున్నాడు. ఆమె గురకపెట్టినప్పుడల్లా తన నాలుకతో ముఖాన్ని నాకడం చేస్తుంటాడట.. దీనివల్ల తామిద్దరం ప్రశాంతంగా నిద్రపోతున్నామని జాసన్ చెబుతున్నాడు. అయితే అంతకుముందు జాసన్ కారణంగా తనకు కూడా నిద్ర సరిగా వచ్చేది కాదని షార్నీ చెప్పారు.. గురక వచ్చే ప్రతిసారీ తనను నిద్ర లేపేవాడని దానివల్ల చాల ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ టెక్నీక్ వలన చాల సంతోషంగా ఉన్నామని ఆమె చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story