మ్యాంగోతో బరువు.. డైటీషియన్లు ఏం చెప్తున్నారు..

మ్యాంగోతో బరువు.. డైటీషియన్లు ఏం చెప్తున్నారు..
వేసవిలో మాత్రమే కనిపించే మామిడి పండుని రుచి చూడకుండా ఎలా ఉంటారు.

వేసవిలో మాత్రమే కనిపించే మామిడి పండుని రుచి చూడకుండా ఎలా ఉంటారు. ఆ మాటకొస్తే తిండీ తిప్పలు మానేసి ఒట్టి మ్యాంగోస్ తినమన్నా హ్యాపీగా తినేస్తామంటారు.. తెలిసిన వాళ్లు సరదాగా ఏంట్రా మూడుపుటలా మ్యాంగో తింటున్నావా.. ముఖం కూడా మ్యాంగో మాదిరిగా కనిపిస్తుంది అని ఆట పట్టిస్తుంటారు. నిజమే కొంచెం పుల్లగా చాలా తియ్యగా ఉండే మామిడి పండంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.

ఇప్పుడంటే కేజీల్లెక్కన అమ్ముతున్నారు కానీ ఇదివరకటి రోజుల్లో డజన్ల లెక్కన అమ్మేవారు.. ఊరు నుంచి ఎవరైనా వస్తుంటే ఓ వంద కాయ బప్‌కు వెయ్యమని ఆర్డరిచ్చేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయ్.. అక్కడ కూడా పిరిం అయిపోయాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ముద్దుగా బొద్దుగా ఉండేవారు మ్యాంగో తినాలంటే భయపడిపోతుంటారు.. ఇంకా బరువు పెరిగిపోతామేమో అని ఆందోళన చెందుతారు.. కానీ ఆ భయాలేవీ పెట్టుకోకుండా శుభ్రంగా లాగించేయమంటున్నారు పోషకాహార నిపుణులు.

మీ భాగాలను నియంత్రించండి: మామిడి పండ్లలో సూక్ష్మపోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మీరు వాటిని ఆహారంలో సురక్షితంగా చేర్చవచ్చు. అయితే మీరు వాటిని ఎక్కువగా తినకూడదు. అతిగా ఏది చేసినా ప్రమాదమే. భోజనంతో తినవద్దు: భోజనంతో పాటు తినడం వల్ల ఎక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి. అల్పాహారంగా తినండి: ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. మామిడి పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మామిడి కూడా శక్తి గా ఉపయోగపడుతుంది. అందువలన, ఇది ఒక గొప్ప ప్రీ-వర్కౌట్ ఫుడ్‌గా మారుతుంది.

Tags

Read MoreRead Less
Next Story