Human Body : మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు..!

మానవ శరీరంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించే తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలా మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం...!
1. నిద్రలో అయిదు దశలు ఉంటాయి. అయిదవ దశలోనే ఘాడమైన నిద్రపడుతుంది. ఘాడ నిద్రలో ఉన్నప్పుడే మనిషి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. నిద్ర గాఢత కారణంగానే 90 శాతం కలలు మనకి గుర్తు ఉండవు.
2. మానవ శరీరంలోని అన్ని రక్తనాళాల పొడుపు 1,00,000 మైళ్లు ఉంటుంది.
3. మన ఊపిరితిత్తుల సర్‌ఫేస్ ఏరియా 50 నుంచి 75 స్క్వేర్ మీటర్లు. అంటే సుమారుగా టెన్నీస్ కోర్టు అంత ఉంటుంది.
4. గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి. పిండం ఆరు నెలల వయసు ఉన్నప్పుడు ఇవి ఏర్పడతాయి.
5. ఒక సెకనుకు మనిషి శరీరంలో 300 మిలియన్ల కణాలు చనిపోతూ.. మరో 300 మిలినయన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. మనిషి ప్రాణంతో ఉండే అంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
6. మనిషి ఊపిరి పీల్చుకోవడం, మింగడం ఈ రెండింటిని పనులని ఒకేసారి చేయలేరు. కానీ.. పసిపిల్లలు ఈ రెండు పనులని ఏకకాలంలో సునాయాసంగా చేయగలరు.
7. మానవ శరీరంలో రక్తప్రసారం లేని ఏకైక భాగం కంటిలోని కార్నియా. ఇది గాలి నుంచే నేరుగా ఆక్సీజన్ గ్రహిస్తుంది.
8. తల వెంట్రుకలు చలికాలంలో కంటే వేసవి కాలంలో వేగంగా పెరుగుతాయి.
9. మనిషి ఆహారం లేకపోయినా.. తన శరీర సౌష్టవాన్ని బట్టి కొన్ని వారాల పాటు బతకగలడు. కనీ.. నిద్ర లేకుండా మాత్రం 11 రోజుల కంటే ఎక్కవ బతకలేడు.
10. స్త్రీ శరీరంలోని అతి పెద్ద కణాలు 'అండాలు'.. పురుష శరీరంలో అతి చిన్నవి వీర్య కణాలు. వీర్య కణం కంటే అండం సుమారు 30 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్లనే మానవ పుట్టుక మొదలవుతుంది.
11. మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఒక మిలియన్ జిగా బైట్స్ వరకు ఉంటుంది.
12. నోటి దవడ వెనుక భాగంలోని ఉండే కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం. నోరు తెరవాలన్నా, మూయాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే.
13. మనవ మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com