పీరియడ్స్‌లో సౌకర్యవంతం 'మెన్‌స్ట్రువల్ కప్స్'.. వీటి గురించి వివరంగా..

నెలకోసారి వచ్చే రుతుస్రావంతో మహిళలకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అందునా ఉద్యోగాలు చేసే మహిళలకు మరింత కష్టం. రక్తస్రావం ఎక్కువగా ఉంటే పని చేసే సమయంలో ప్యాడ్స్ మార్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెన్‌స్ట్రువల్ కప్స్ సౌకర్యవంతంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది మహిళలకు వీటికి గురించి తెలియకపోవచ్చు. ఈ పరికరానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇది రబ్బరు లేదా సిలికాన్‌తో చేసిన చిన్న, సౌకర్యవంతమైన గరాటు ఆకారంలో ఉండే కప్పు. ఇది మీ పీరియడ్ ద్రవాన్ని అందులో పడేలా చేస్తుంది.ఈ కప్పులు ఇతర పద్ధతుల కంటే ఎక్కువ ఉపయోగంగా ఉంటాయి. చాలా మంది మహిళలు అధిక రక్త స్రావ సమస్యను ఎదుర్కొంటారు. మీ రక్త ప్రవాహాన్ని బట్టి, మీరు 12 గంటలకు ఒకసారి ఒక కప్పు ధరించవచ్చు.
ఈ కప్పులు రెండు రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి వాడిన వెంటనే పడేయొచ్చు. రెండు ఒకసారి వాడిన కప్పుని భాగా శుభ్రపరిచి అనేకసార్లు ఉపయోగించవచ్చు. ఈ కప్పును ఎలా వాడాలి. ఎలా తీయాలి. దాన్ని ఎలా శుభ్రం చేయాలి ఇలా ఎన్నో విషయాలపై అవగాహన ఉండదు.
రుతుస్రావ సమయంలో ఈ కప్పును ఎలా ఉపయోగించాలి.
మీకు రుతు కప్పు వాడటానికి ఆసక్తి ఉంటే, మీ గైనకాలజిస్ట్‌తో ఒకసారి మాట్లాడండి. మీరు ఆన్‌లైన్‌లో లేదా బయటి స్టోర్లలో కొనుగోలు చేయగలిగినప్పటికీ, మీకు మొదట ఎంత సైజ్ కప్పు అవసరమో తెలుసుకోవాలి. మిమ్మల్ని పరిశీలించిన తరువాత వైద్యులు ఈ విషయాన్ని వివరిస్తారు.
నీ వయస్సు
మీ గర్భాశయ పొడవు
మీకు భారీ ప్రవాహం ఉందా లేదా అనేది
కప్ యొక్క దృఢత్వం మరియు ఆవశ్యత
కప్ సామర్థ్యం
మీ వెజైనా కండరాల బలం
మీది నార్మల్ డెలివరీ అయితే.. తదితర అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని కప్ సైజ్‌ని డాక్టర్ సూచిస్తారు.
ఇక వివాహం కాని 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలకు సాధారణ సైజు కప్పులు సిఫార్సు చేయబడతాయి. 30 ఏళ్లు పైబడిన లేదా భారీ కాయం ఉన్న మహిళలకు పెద్ద సైజు కప్పులను వైద్యులు సిఫార్సు చేస్తారు.
మీరు మొదటిసారి రుతు కప్పును ఉపయోగించినప్పుడు, అది అసౌకర్యంగా అనిపించవచ్చు. మీరు కప్పుని ఉపయోగించడానికి ముందు, అంచుకి నీరు లేదా ఆయిల్ రాస్తే రుతు కప్పుని వెజైనాలోకి చొప్పించడం చాలా సులభం అవుతుంది.
రుతు కప్పు ఎలా ఉంచాలి
రుతు కప్పును చొప్పించడం చాలా సులభం. కప్పును ఉపయోగించడానికి కొన్ని దశలను అనుసరించాలి..
మీ చేతులను బాగా కడగాలి.
రుతు కప్పును సగానికి గట్టిగా మడవండి. ఒక చేతితో పట్టుకొని మరో చేతితో లోపల ప్రవేశ పెట్టాలి.
ఇది మీ గర్భాశయానికి కొన్ని అంగుళాల క్రింద కూర్చుని ఉండాలి.
మీరు కప్పును సరిగ్గా ప్రవేవ పెట్టిన తరువాత మీకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. మీ కప్పు బయటకు పడకుండా మీరు కదలడం, దూకడం, కూర్చోవడం, నిలబడటం, ఇతర రోజువారీ కార్యకలాపాలు కూడా చేయగలగాలి. మీకు దానికి మొదటి సారి ఉపయోగిస్తున్నప్పుడు సమస్య ఉంటే, మీ వైద్యుడితో మాట్లాడండి.
మీ రుతు కప్పును ఎప్పుడు తీయాలి
మీరు 6 నుండి 12 గంటలు రుతు కప్పు ధరించవచ్చు, మీకు భారీ ప్రవాహం ఉందా లేదా అనే దానిపై కప్‌ని మార్చుకోవడం ఆధారపడి ఉంటుంది.
కానీ రుతుస్రావం అధికంగా ఉన్నా లేకపోయినా కప్పును 12 గంటల తరువాత తొలగించాలి. ఒక వేళ రక్త స్రావం అధికంగా ఉంటే షెడ్యూల్ కంటే ముందే దాన్ని ఖాళీ చేయాలి.
రుతు కప్పును బయటకు తీసే ముందు కూడా చేతులు కడుక్కుని తీయాలి. ఈ విధంగా మీ కప్పు రోజుకు కనీసం రెండుసార్లు ఖాళీ చేయాలి.
రుతు కప్పులు మన్నికైనవి అయితే 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటాయి. తొలగించిన తర్వాత పునర్వినియోగపరచలేని కప్పులను పడేయాలి. మన్నికైన మళ్లీ వినియోగించే కప్పులు కొన్నట్లైతే వాటి వినియోగానంతరం శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టి భద్రపరచాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com