Coffee Powder: వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు.. కాఫీ పొడితో దోమలకు చెక్..

Coffee Powder: అసలే వర్షాకాలం.. ఆపై దోమలు, ఈగలు.. వీటి ద్వారా వైరల్ ఫీవర్లు, పలురకాల అంటు వ్యాధులు వస్తుంటాయి.దోమల నివారణకు రిఫెల్లెంట్స్ , దోమల నెట్లు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా వాటినుంచి తప్పించుకోవడం కష్టంగా మారుతుంటుంది.. కొన్ని రిఫెల్లెంట్స్‌తో ఆస్తమా వంటి శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారికి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దోమల పెరుగుదలకు చుట్టుపక్కల పరిసరాలు, పరిశుభ్రత కూడా కారణమవుతుంటాయి. అందుకే చుట్టుపక్కల చెత్తా చెదారం లేకుండా, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
కొన్ని రకాల దోమ కాటు వల్ల ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దోమల నివారణకు అనేక చిట్కాలు కూడా ప్రయోగిస్తుంటారు. వాటిల్లో సమర్ధవంతంగా పని చేసేది కాఫీపొడి.. ఒక మట్టిపాత్రలో నిప్పులు తీసుకుని అందులో ఒకటి రెండు స్పూన్ల కాఫీ పౌడర్ చల్లితే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లంతా వ్యాప్తి చెందేలా చేయాలి. దాంతో దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. కాఫీ పొడి వాసన దోమలకు, ఇతర కీటకాలకు పడదు.. ఎండబెట్టిన వేపాకులు, వెల్లుల్లి పొట్టు కూడా దోమల నివారణకు ఉపయోగిస్తుంటారు.
దోమలు రాకుండా నివారించేందుకు ప్రతి రోజు చెత్త బుట్టను క్లీన్ చేయడం, బాత్ రూములు, సింకులు శుభ్రంగా వేడినీటితో కడగడం, తడి బట్టలు లేకుండా చూసుకోవడం, సాయింత్ర సమయాల్లో ఇంట్లో సాంబ్రాణి పొగ లేదా కాఫీ పొడి వేయడం వంటివి చేస్తుండాలి.. నిద్రించేముందు ఒంటికి వేపనూనె, కొబ్బరి నూనె కలిపి శరీరానికి రాసుకోవాలి. దీంతో దోమలు కుట్టకుండా కొంతవరకు శరీరాన్ని కాపాడుకోవచ్చు.
మీకు ఉన్న స్థలంలోనే కొన్ని కుండీలు ఏర్పాటు చేసుకుని అందులో తులసిమొక్క, గుల్ మెంహందీ మొక్క, పుదీనా, బంతిమొక్క, నిమ్మగడ్డి మొక్క వేసుకుంటే వాటి వాసనకు దోమలు రాకుండా ఉంటాయి. ఈ మొక్కల ఆకులు, పువ్వుల నుంచి వెలువడే వాసన ఈగలు, దోమలు, ఇతర కీటకాలను రాకూండా దూరం చేస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com