Muskmelon: వేసవిలో శరీరానికి అత్యంత ప్రయోజనకరమైన పండు 'కర్బూజ'

Muskmelon: వేసవిలో శరీరానికి అత్యంత ప్రయోజనకరమైన పండు కర్బూజ
Muskmelon: ఓ గ్లాసు జ్యూస్ తాగినా త్వరగా ఆకలి అవదు. ఫలితంగా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు .

Muskmelon: వేసవి కాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్‌లో అనేక రకాల పండ్లు మార్కెట్‌లో లభిస్తాయి. అవన్నీ శరీరానికి మేలు చేసేవి. అయితే, కర్భూజ, తర్భూజ వండి పండ్లు వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని కలిగించే పండ్లు.

కర్భూజ పండులో 95% నీటితో పాటు అధిక మొత్తంలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సిలు ఉంటాయి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, అదే సమయంలో, గుండెల్లో మంట సమస్య కూడా తొలగిపోతుంది. ఇది కాకుండా, దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండ్లలో ఉన్న అధిక నీటి శాతం శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో- కర్బూజలో యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పండ్లు ఊబకాయాన్ని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఇదే కాకుండా డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఓ కప్పు ముక్కలు తిన్నా, ఓ గ్లాసు జ్యూస్ తాగినా త్వరగా ఆకలి అవదు. ఫలితంగా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు .

క్యాన్సర్‌ను నిరోధించడానికి- ఈ పండులో పెద్ద మొత్తంలో ఆర్గానిక్ పిగ్మెంట్ కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది.

కళ్లకు- ఈ పండులో ఉన్న విటమిన్-ఎ, బీటా కెరోటిన్ కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఇది కళ్ల కాంతిని వేగవంతం చేస్తుంది.

మధుమేహం- కర్భూజలో ఆక్సికిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.

గర్భిణీ స్త్రీలకు - గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

పంటి నొప్పి- విటమిన్లు పుష్కలంగా ఉన్న కర్భూజ పంటి నొప్పిని తగ్గిస్తుంది.

ఈ కంటెంట్ నెట్ లో లభించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. వైద్యుల అభిప్రాయానికి ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త తగదు. వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story