వాట్ యాన్ ఐడియా సర్‌ జీ.. బీరుతో దోమలు పరార్..

వాట్ యాన్ ఐడియా సర్‌ జీ.. బీరుతో దోమలు పరార్..
ముసుగు పెట్టి పడుకున్నా చెవిలో గుయ్ గుయ్‌మని దోమలు రొద చేస్తుంటే నిద్ర పోవడం చాలా కష్టం.

ముసుగు పెట్టి పడుకున్నా చెవిలో గుయ్ గుయ్‌మని దోమలు రొద చేస్తుంటే నిద్ర పోవడం చాలా కష్టం. దుప్పట్లో నుంచి కాలో వేలో బయటకొస్తే కుట్టి పీల్చి పిప్పి చేసేందుకు కాచుక్కూర్చుని ఉంటాయి దోమలు. మార్కెట్లో దోమల నివారణ మార్గాలు ఎన్ని ఉన్నా దోమల బెడద తప్పదు. పైగా ఆ వాసనలు అందరికీ పడవు.

దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసించే ఎవరైనా వాటిని తగ్గించడానికి నిరంతరం కొత్త మార్గాలకోసం వెతుకుతుంటారు. దోమలవల్లే మలేరియా, డెంగ్యూ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు దరి చేరుతుంటాయి. ఓసారి ఈ చిట్కాలు కూడా ప్రయత్నించి చూడొచ్చు. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం హానికలిగించని వస్తువులు.

కర్పూరం అనేది దోమలను వదిలించుకోవడానికి సహాయపడే ఒక సహజమైన హోం రెమెడీ. దీని వాసన దోమలను దూరం చేస్తుంది. ముడి రూపంలో దొరికే కర్పూరాన్ని గది నాలుగు మూలలో ఉంచితే ఆ వాసనకు దోమలు రాకుండా నివారించవచ్చు. మరొక పద్దతి అన్ని తలుపులను మూసివేసి, ఆపై కర్పూరం వెలిగించడం. అరగంటలో గదిలో ఉన్న దోమలన్నీ చస్తాయి.




వెల్లుల్లి దోమలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి కొద్దిగా నీటిని వేసి మరిగించాలి. ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి మీ గది, గ్యారేజ్ మొదలైన వాటి చుట్టూ పిచికారీ చేస్తే ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి.




కాఫీ పొడి వాసనకి కూడా దోమలు రావు.. ఇంటి చుట్టూ నిలిచి పోయిన నీరు దోమల సంఖ్యను పెంచుతుంది. వాటిపైన కాఫీ పొడి చల్లితే దోమ గుడ్లు నీటి ఉపరితలంపైకి వచ్చి ఆక్సిజన్ అందక మరణిస్తాయి.



మరొక ఫన్నీచిట్కా.. దోమలు మద్యం వాసనను తట్టుకోలేవు. గదిలో బీర్ లేదా ఆల్కహాల్ గ్లాస్‌లో పోసి ఉంచండి. అది ఖచ్చితంగా దోమలను దూరంగా ఉంచుతుంది.



పొడిమంచుతో దోమలు పరార్.. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో పొడి మంచును ఉంచితే దాని నుండి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఇది దోమలను ఆకర్షిస్తుంది.





Tags

Read MoreRead Less
Next Story