Health : తినేటప్పుడు ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకుంటున్నారా.. ఐతే యమ డేంజర్..

Health : తినేటప్పుడు ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకుంటున్నారా.. ఐతే యమ డేంజర్..
Health : తినేటప్పుడు ఆహారంలో కొందరికి ఉప్పు వేసుకుంటే ఆయుశ్షును తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Health : తినేటప్పుడు ఆహారంలో కొందరికి ఉప్పు వేసుకోవడం అలవాటు. కొందరు ఉప్పు సరిపోయినా మళ్లీ ఎక్స్‌ట్రా వేసుకుంటారు. ఈ అలవాటు ఆరోగ్యాన్ని దెబ్బ తీసి ఆయుశ్షును తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

యూకె బయోబాంగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 5 లక్షల మందిపై ఉప్పు ఎలా వాడుతున్నారనే సర్వేను చేశారు. 9 సంవత్సరాల పాటు వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారు. అందులో కొందరు తినేటప్పుడు ఉప్పు రోజూ వేసుకుంటామని, మరికొందరు అప్పుడప్పుడని, ఇంకొందరు వేసుకోమని సమాధానమిచ్చారు.

సర్వే ఫలితాల్లో ఉప్పు రెగులర్‌గా తినేటప్పుడు వేసుకునే వాళ్లు 28 శాతం తొందరగా మరణించే అవకాశం ఉన్నట్లు కనుగ్గొన్నారు.2006 నుంచి 2010 వరకు జరిపిన ఈ సర్వేలో తొమ్మిది సంవత్సరాల తరువాత వీరిలో 18వేల 500 మంది 75 ఏళ్లకు ముందే మరణించినట్లు తేలింది.

ప్రతీ రోజు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును సేవిస్తే.. బ్లడ్ ప్రజర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story