Diabetic Drug: మధుమేహానికి కొత్త మందు.. వారానికి ఒకసారి

Diabetic Medicine: మధుమేహ రోగులకు పెద్ద సమస్య ప్రతి రోజు ఇన్సులిన్ తీసుకోవడం.. ఇక నుంచి ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. వారానికి ఒకసారి ఈ కొత్త మందు తీసుకుంటే సరిపోతుంది అని అంటున్నారు నిపుణులు.. ఈ మందు వాడకానికి అమెరికా ఎఫ్‌డీఏ కూడా ఇటీవలే అనుమతులు తెలిపింది.
దీనిపేరు టిర్‌జెపటైడ్.. ఇది కూడా ఇన్సులిన్ మాదిరిగానే ఉంటుంది.. ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్లుకగాన్-లైక్ పెప్టెడ్-1 (జీఎల్పీ-1), గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టెడ్ (జీఐపీ) గ్రాహకాలు రెండింటినీ చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
అన్నవాహిక దగ్గరనుంచి ప్రారంభించి తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తుంది. దీంతో ఆకలి తగ్గుతుంది.. తినాలన్న ధ్యాస ఉండదు.. పేగుల్లోకి మందు చేరుకోగానే ఇన్సులిన్ ఉత్పత్తి ప్రేరేపితమవుతుంది. ఆహారం ఆలస్యంగా జీర్ణమవడం వలన గ్లూకోజు ఎక్కువగా విడుదల కాదు.
అదే సమయంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతున్నట్లు ప్రయోగ పరీక్షలో తేలింది. ఇది అధిక గ్లూకోజును తగ్గిస్తూనే గ్లూకోజు మోతాదు మరీ పడిపోకుండా కూడా కాపాడుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ తో కలిపి తీసుకోవడం వలన బరువు నియంత్రణలో ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com