కోవిడ్ కొత్త వేరియంట్‌లు.. ఎందుకు ఎప్పుడూ డిసెంబర్‌లోనే..

కోవిడ్ కొత్త వేరియంట్‌లు.. ఎందుకు ఎప్పుడూ డిసెంబర్‌లోనే..
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్-19 వేరియంట్ మరోసారి విజృంభిస్తోంది.

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్-19 వేరియంట్ మరోసారి విజృంభిస్తోంది. మరోసారి డిసెంబర్‌లో కొత్త స్పైక్ కనిపించింది. డిసెంబర్‌లో ఈ కొత్త వేరియంట్‌లు పుట్టగొడుగుల్లా ఎందుకు పుట్టుకొస్తాయో విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అది 2019 శీతాకాలం. ప్రపంచం అంతా నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధమైంది. సరిగ్గా అప్పుడే ఒక ప్రత్యేకమైన వైరస్ - చైనాలో వెలుగు చూసింది - మన జీవితాలపై దాడి చేసింది.

నాలుగు సంవత్సరాల తరువాత, కోవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పట్టింది, అయితే వైరస్ మన జీవితాల్లో అనేక రూపాల్లో దాడి చేయడానికి మరోసారి సిద్ధంగా ఉంది. ఈ డిసెంబర్‌లో, మహమ్మారికి కారణమైన కరోనావైరస్ యొక్క కొత్త జాతి - JN.1 - ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ JN.1ప్రజారోగ్యానికి తక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని పేర్కొంది.

కోవిడ్-19 డిసెంబర్ 2020లో మూడు పెద్ద మ్యుటేషన్‌లను చూపించింది.. అవి ఆల్ఫా (బి.1.1.7), బీటా (బి.1.351), మరియు గామా (పి.1). ఒక సంవత్సరం తర్వాత, డిసెంబర్ 2021లో లాక్‌డౌన్‌లు సడలించడం ప్రారంభించిన కొద్ది నెలలకే Omicron వేరియంట్ మరోసారి ఇళ్లలోనే కూర్చోబెట్టింది. మరుసటి సంవత్సరం, డిసెంబర్ 2022లో, కొత్త మేజర్ వేరియంట్ ఆవిర్భవించనప్పటికీ, BA.2 మరియు BA.5 వంటి సబ్‌వేరియంట్‌ల పెరుగుదల ఏర్పడింది.

ఇప్పుడు JN.1 వేరియంట్.. ఇది కూడా Omicron వంశానికి చెందినది. ఈ వైవిధ్య పరిణామాలలో పునరావృతమయ్యే లక్షణం డిసెంబర్ నెలలోనే కనిపిస్తుంది.

JN.1 అంటే ఏమిటి?

ఇది ఇప్పటికే భారతదేశం, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్‌తో సహా అనేక దేశాలలో కనుగొనబడింది. పిఎస్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ జిసి ఖిల్నాని మాట్లాడుతూ, ఈ కొత్త వేరియంట్ జ్వరం, గొంతునొప్పి, దగ్గు మరియు తలనొప్పి రూపంలో తేలికపాటి అనారోగ్యానికి కారణమవుతుందని చెప్పారు. ఇది వృద్ధులు, ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్లు ఉన్న వ్యక్తులకు హాని కలిగించవచ్చు" అని పేర్కొన్నారు.

అనేక అధ్యయనాలు కోవిడ్-19 కేసుల పెరుగుదల వెనుక ఒక వేగవంతమైన కారకంగా చల్లని మరియు పొడి శీతాకాలాన్ని సూచించాయి. మహమ్మారి యొక్క మొదటి వేవ్ సమయంలో, వాతావరణ పరిస్థితుల కారణంగా వైరస్ ఎంత సులభంగా వ్యాప్తి చెందుతాయో చూపించాయి.

వైరస్ పరిణామం చెందుతున్నప్పుడు, కొత్త జాతులు ఉద్భవిస్తాయి. అయితే మునుపటి జాతులకు మన రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. దీని అర్థం 'న్యూ కిడ్ ఆన్ ది బ్లాక్' అని మన శరీరాలు గుర్తించలేవు, ఇది పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్‌లకు దారి తీస్తుంది" అని కొచ్చిలోని అమృత హాస్పిటల్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపు అన్నారు.

హాలిడే ట్రావెల్

కోవిడ్-19 డిసెంబరులో చైనాలో ఉద్భవించింది మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఈ నెలలోనే. ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలలో డిసెంబర్ సెలవుదినం. ఈ సంవత్సరం కూడా, JN.1 వేరియంట్ హాలిడే సీజన్ కారణంగా వేగంగా ప్రయాణిస్తోంది అని డాక్టర్ దీపూ పేర్కొన్నారు.

అయితే ఈ కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదుగానీ జాగ్రత్త వహించమని సలహా ఇస్తున్నారు.

న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమైనప్పుడు, ఇప్పటికీ అదృశ్య శత్రువు దాగి ఉన్న నేపథ్యంలో గతంలో మనం చాలాసార్లు చేసినట్లుగానే మరోసారి టీకాలు, మాస్క్‌లతో మన రోగనిరోధక రక్షణను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story