New Year Resolution: ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోండి.. అంతా బావుంటుంది..

New Year Resolution: ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోండి.. అంతా బావుంటుంది..
New Year Resolution: మంచి అలవాట్లు మన దిన చర్యలో భాగం చేసుకోవడానికి రోజులు, వారాలతో పనేముంది. ఆలస్యం అమృతం విషం. ఏదైనా మీకు మంచిది అనిపిస్తే ఆరోజే మొదలు పెట్టేయండి.

New Year Resolution: మంచి అలవాట్లు మన దిన చర్యలో భాగం చేసుకోవడానికి రోజులు, వారాలతో పనేముంది. ఆలస్యం అమృతం విషం. ఏదైనా మీకు మంచిది అనిపిస్తే ఆరోజే మొదలు పెట్టేయండి. కొత్త ఏడాది వచ్చిందంటే అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని ప్రణాళికలు వేసుకుని ఓ పెద్ద చిట్టా తయారు చేసుకుంటారు. వారం రోజులు బాగానే ఉంటుంది. ఆ తరువాత బద్దకం ఆవరించేస్తుంది. ఎవరో ఎందుకు మిమ్మల్ని మోటివేట్ చేయాలి. మీకు మీరే సరైన న్యాయ నిర్ణేత అని గుర్తుపెట్టుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి. మీ కోసం మీరు ఏదైనా చేయండి. ఓ మంచి ప్రయత్నం మీ ఆరోగ్యానికి, మీ మానసిక ఉల్లాసానికి, మీరు ఎంచుకున్న రంగంలో ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది అన్న విషయం మర్చిపోకండి.


ఈసారి మీ న్యూ ఇయర్ రిజల్యూషన్‌‌లో కచ్చితంగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వండి.. ఇది మీ మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ సంవత్సరం, మనం తీసుకున్న తీర్మానాలపై అంకితభావంతో పని చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. మీ ఉత్సాహాన్ని రీఛార్జ్ చేసుకునేందుకు, మీ తీర్మానాలకు కట్టుబడి ఉండటానికి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి.



ఆరోగ్యకరమైన జీవనశైలి లక్ష్యాల గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు ముందుగా దానిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించండి. పోషకాల లోపం వల్ల దీర్ఘకాలంలో శరీరానికి హాని కలుగుతుంది. బరువు తగ్గడం అనేది మీ ఆరోగ్యకరమైన లక్ష్యం అయితే.. న్యూట్రిషన్ వ్యవస్థాపకుడు అమన్ పూరి 2023లో మీరు కట్టుబడి ఉండవలసిన 5 ఫిట్‌నెస్ లక్ష్యాలు సూచించారు.. అవేంటో చూద్దాం..


1. అల్పాహారం కోసం సమయాన్ని వెచ్చించండి: అల్పాహారం తప్పనిసరి. ఉదయాన్నే అధిక-ప్రోటీన్ ఉన్న అల్పాహారం తీసుకుంటే జీవక్రియ వేగవంతమవుతుంది. బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది.


2. భోజనాన్ని దాటవేయడం మానుకోండి: భోజనం మానేయడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. పోషకాహార లోపం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.


3. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి: అవాస్తవ లక్ష్యాలను నిర్దేశించుకోవడం నిరాశకు దారితీస్తుంది. కాబట్టి వారానికి 1/2 నుండి 1 కిలోల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు, ఇది నెలవారీ 2 నుండి 4 కిలోల వరకు ఉంటుంది. శారీరక శ్రమ ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.


4. సమతుల్య ఆహారం తీసుకోండి: సమతుల్య ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. పని చేయడానికి కావలసని శక్తిని అందిస్తుంది. అలసటను దూరం చేస్తుంది. అంటువ్యాదులను నివారిస్తుంది. రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలను చేర్చండి. తగినంత నీటిని తీసుకోవడం విస్మరించవద్దు- నీరు సహజంగా ఆకలిని అణిచివేస్తుంది. సంతృప్తిని పెంచుతుంది మరియు వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.


5. అవసరమైతే సప్లిమెంట్లను తీసుకోండి: ఆహార పదార్ధాలు మందులు కాదు- అవి ఏ వ్యాధిని నయం చేయలేవు. అయినప్పటికీ, పోషక పదార్ధాలు పోషకాహార లోపాలను నివారిస్తాయి. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లను తీసుకోండి.


6. మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి: మానసిక ఆరోగ్యం అనేది భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. సంతోషకరమైన జీవితానికి ఇది చాలా ముఖ్యమైనది. మానసిక ఒత్తిడి మనల్ని స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్‌ వంటి వ్యాధులకు గురి చేస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా, నృత్యం, పెయింటింగ్ ఏదైనా మీకు నచ్చినది, మీకు వచ్చినది చేయడం కొనసాగించండి.

Tags

Read MoreRead Less
Next Story