Oatmeal Diet: బరువు తగ్గడానికి ఓట్ మీల్ డైట్.. 7 రోజులు ఇలా చేస్తే..
Oatmeal Diet: ఓట్స్ మీకు ఆరోగ్యకరమైన ఫైబర్ ని, పోషకాలను అందిస్తుంది. రోజుకు కనీసం రెండు సార్లు ఓట్స్ తినడం ద్వారా బరువు తగ్గవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.

Oatmeal Diet : ఓట్స్ మీకు ఆరోగ్యకరమైన ఫైబర్ ని, పోషకాలను అందిస్తుంది. రోజుకు కనీసం రెండు సార్లు ఓట్స్ తినడం ద్వారా బరువు తగ్గవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.
ఓట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అల్పాహారం. అవి ఉడికించడం కూడా చాలా సులభం. ఓట్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలి బాధను తగ్గిస్తుంది. చిరుతిండిపైన ధ్యాసను తొలగిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునేవారికి ఓట్ మీల్ ఓ మంచి ప్రత్యామ్నాయ ఆహారం. ఓట్స్ తో పాటు కొన్ని ఇతర పోషకమైన ఆహారాలు తీసుకోవడం కూడా అవసరం.
బరువు తగ్గడానికి 7-రోజుల ఓట్ మీల్ డైట్ ప్రణాళిక.. మొదటి రెండు రోజులు రోజుకు మూడు సార్లు ఓట్స్ తీసుకోవాలి. తరువాతి రెండు రోజులు రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. మిగిలిన మూడు రోజులు రోజుకు ఒకసారి ఓట్స్ తీసుకోవాలి. మొదటి రెండు రోజుల్లో 100-1200 కేలరీలు, తరువాతి రెండు రోజుల్లో 1200-1400 కేలరీలు, మిగిలిన మూడు రోజుల్లో 1400-2000 కేలరీలు శరీరానికి అందుతాయి. ఓట్స్ ద్వారా శరీరానికి కావలసినంత ఫైబర్ అందుతుంది. ఇది జీర్ణక్రియకు గొప్పగా సహకరిస్తుంది. అంతేకాకుండా, ఓట్స్‌లోని ఫైబర్ ప్రేగులలోని కొవ్వును నిర్వీర్యం చేస్తుంది.
బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఓట్స్ వంటకాలు.. ఓట్‌మీల్ డైట్‌ని అనుసరించేటప్పుడు మీరు తినగలిగే ఐదు ఆరోగ్యకరమైన తక్కువ కేలరీల వంటకాలు..
1. ఓట్స్ కిచిడీ : కొద్దిగా పెసరపప్పు, కూరగాయల ముక్కలు వేసి రుచికరంగా కిచిడీ తయారు చేసుకుని తింటే పోషకాలు అందడంతో పాటు ఆకలిని నిరోధిస్తుంది.
2. ఓట్స్ ఊతప్పం : దక్షిణ భారత వంటకమైన ఊతప్పం ఆరోగ్య దాయకం.
3. ఉడికించి వేయించిన గుడ్డుతో కలిపి ఓట్స్ : ఈ లంచ్ రెసిపీ ఓట్ మీల్ లో సరైన మొత్తంలో ఫైబర్ మరియు ప్రొటీన్లు ఉంటాయి.
4. ఓట్స్ ఇడ్లీ : ఓట్స్ ఇడ్లీ వేడి వేడిగా కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. ఆరోగ్యం కూడా
5. చికెన్ తో కలిపి ఓట్స్ : మాంసాహార ప్రియులకు మంచి రుచికరమైన వంటకం ఇది. చికెన్ తో కలిిపి ఓట్స్ తింటే శరీరానికి కావలసిన ప్రొటీన్, విటమిన్ అందుతుంది.
1. ఓట్ మీల్ తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు: 1. గుండెకు రక్షణ ఇస్తుంది. డాక్టర్ మనోజ్ అహుజా ప్రకారం, "ఓట్స్ హృదయ సంబంధ వ్యాధులను నిరోధించే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. అంతేకాకుండా, ఓట్స్‌లోని డైటరీ ఫైబర్‌లు మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్)ని ప్రభావితం చేయకుండా చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ని తగ్గిస్తాయి. అదనంగా, వోట్స్‌లో ప్లాంట్ లిగ్నన్‌లు ఉంటాయి, ఇవి గుండె జబ్బుల నుండి కూడా రక్షిస్తాయి. కాబట్టి, మన రోజువారీ ఆహారంలో ఓట్‌మీల్‌ని చేర్చుకోవడం వల్ల మన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
2. ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది: ఓట్స్ ఫైబర్‌తో (కరిగే మరియు కరగనివి రెండూ) నిండి ఉన్నాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు మరియు ప్రేగు కదలికలను సులభతరం చేయవచ్చు. మీ రోజువారీ ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు. వాటిని మీ అల్పాహారం భోజనంలో భాగం చేసుకోవచ్చు.
3. మధుమేహాన్ని నియంత్రిస్తుంది: ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, మీరు తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవాలి. ఓట్స్‌లోని అధిక ఫైబర్ కంటెంట్, పిండి పదార్థాలు ఈ మొత్తం ఆహారాన్ని సాధారణ చక్కెరలుగా మార్చడాన్ని నెమ్మదిస్తాయి.
4. హైపర్ టెన్షన్ నివారిస్తుంది: అధిక రక్తపోటు ఉన్నవారు తప్పనిసరిగా ఓట్‌మీల్‌ను తీసుకోవాలి. మీ రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ఓట్ మీల్ డైట్ ఎంతో ఉపయోగకరం.
5. చర్మాన్ని రక్షిస్తుంది: ఓట్స్ దురద సమస్యలను దూరం చేస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, "ఓట్ మీల్ చర్మం యొక్క pH స్థాయిలను నియంత్రించగలదు. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది."
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్యలకు నిపుణులు పర్యవేక్షణ అవసరం.
RELATED STORIES
Teenagers: టీనేజ్ పిల్లలతో ఎలా వ్యవహరించాలి.. తల్లిదండ్రులకు నిపుణులు...
30 Jun 2022 7:16 AM GMTpigeon droppings can cause allergies: పావురాలతో అలెర్జీ వస్తుందా.....
29 Jun 2022 11:00 AM GMTCurd: పెరుగుతో ప్రయోజనాలెన్నో.. కానీ కొన్ని ఆహార పదార్థాలతో...
29 Jun 2022 10:15 AM GMTWeight Loss Tip: బరువు తగ్గేందుకు వెల్లుల్లి, తేనె.. ప్రతిరోజు...
28 Jun 2022 6:43 AM GMTGorintaku Benefits: ఆషాఢంలో గోరింట.. అందం, ఆరోగ్యం..
27 Jun 2022 5:58 AM GMTBone Density: ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఏ ఏ ఆహార పదార్థాలు..
25 Jun 2022 7:19 AM GMT