knee pains: మోకాళ్లు, కీళ్ల నొప్పులకు ఉపశమనం ఈ ఆకుల రసం

knee pains:  మోకాళ్లు, కీళ్ల నొప్పులకు ఉపశమనం ఈ ఆకుల రసం
knee pains: ఒక అధ్యయనం ప్రకారం ఆలివ్ చెట్టు ఆకుల రసం మోకాళ్ల నొప్పులకు మంచి ఔషధంగా పని చేస్తుందని తేలింది

knee pains: వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. మధుమేహం, అలసట, రక్తపోటు, మోకాళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీటన్నింటితో పాటు మోకాళ్ల నొప్పులు కూడా వయసుతో పాటు పెరిగే సమస్య.

నేటి కాలంలో, మోకాళ్ల నొప్పుల సమస్య యువతలో కూడా కనిపిస్తోంది. నొప్పి నుంచి ఉపశమనం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు ప్రతి ఒక్కరు. అయితే తాజాగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఆలివ్ చెట్టు ఆకుల రసం మోకాళ్ల నొప్పులకు మంచి ఔషధంగా పని చేస్తుందని తేలింది. స్విస్ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం..

ఆలివ్ లేదా ఆలివ్ చెట్ల ఆకుల సారం పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుందని పరిశోధనలో కనుగొన్నారు. ఆలివ్ చెట్టు ఆకుల్లో ఔషధ సమ్మేళనాలు ఉన్నాయి. వీటిని పాలీఫెనాల్స్ అని పిలుస్తారు. ఇవి ర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు నొప్పిని, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా ఆలివ్ ఆయిల్ హృదయ ధమనుల లోపల కొవ్వు నిల్వలను తగ్గించడం ద్వారా గుండెకు కూడా రక్షణ అందిస్తుందని తేలింది.

ఇది రొమ్ము క్యాన్సర్, అల్సరేటివ్, డిప్రెషన్‌ తగ్గించడంలోనూ సహాయపడుతుంది. మస్క్యులోస్కెలెటల్ డిసీజ్ జర్నల్ థెరప్యూటిక్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధనలో 55 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 124 మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనకు స్విస్ శాస్త్రవేత్త మేరీ-నోయెల్ హోర్కాజాడా నాయకత్వం వహించారు. పురుషులు, మహిళలు ఇద్దరూ సమానంగా పాల్గొన్న ఈ పరిశోధనలో సగానికి పైగా అధిక బరువు కలిగి ఉన్నారు.

వారిలో 62 మందికి 125 mg ఆలివ్ ఆకుల సారాన్ని రోజుకు రెండుసార్లు ఒక మాత్ర రూపంలో ఇచ్చారు. 6 నెలల తర్వాత మోకాలి నొప్పి నుంచి ఉపశమనం ఉందని తెలుసుకున్నారు. కనుక ఆలివ్ ఆకుల రసం కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

గమనిక: ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. డాక్టర్ సూచన మేరకు నడుచుకోవాలి. ఇది మీకు అవగాహన కోసం మాత్రమే.

Tags

Next Story