బొజ్జ పెరుగుతోందా? ఉల్లి జ్యూస్‎తో తాగండి ..ఉల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బొజ్జ పెరుగుతోందా? ఉల్లి జ్యూస్‎తో తాగండి ..ఉల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Benefits Of onions: ఊబకాయం చాలా మందిని వేదిస్తుంది. పెరిగిన బొజ్జతో నానా తంటాలు పడుతుంటారు. పొట్ట తగ్గడానికి ఎన్నో రకాల ఫీట్లు చేస్తుంటారు

Benefits Of onions: ఊబకాయం చాలా మందిని వేదిస్తుంది. పెరిగిన బొజ్జతో నానా తంటాలు పడుతుంటారు. పొట్ట తగ్గడానికి ఎన్నో రకాల ఫీట్లు చేస్తుంటారు. కొందరూ ఆహారం తగ్గించుకుంటే.. మరికొందరూ వ్యాయామం, వాకింగ్, వంటివి చేస్తారు. పెరిగిన పొట్టతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి.. మీ పొట్ట పెరగకుండా జాగ్రత్తపడండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ ఉంటే చాలు.. బొజ్జను మాయం చేసేయవచ్చు. ఫ్యామిలీ ప్యాక్ నుంచి బయటపడొచ్చు. అదెలాగో చూడండి.


ఉల్లిపాయలు లేకుండా వంటలు కూడా చేయరు. ప్రతి వంటలోనూ ఉల్లిపాయ ఉండాల్సిందే. ఉల్లిని మీరు ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. దానిలో ఉండే క్వెర్‌సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ మెటబాలిజంను పెంపొందించి శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుందంట. ఉల్లిపాయలో కేలరీలు, సోడియం కూడా తక్కువే. కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఉల్లిపాయను ఆహారంలో భాగం చేసుకుంటారు. పెద్ద ఉల్లిపాయను తీసుకుని ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయండి. ఆ పేస్టును నీటిలో కలపండి. ఆ తర్వాత 1-2 టీ స్పూన్ల తేనె కలిపి తాగేయండి.

.


ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తాయి.మూత్రశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి ఔషదం. ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి, బీపీ తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.ఉల్లిపాయలో విటమిన్-C, విటమిన్ B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరసర్ ఉంటాయి. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.


పొట్ట తగ్గించాలనుకుంటే.. ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి ఉదయాన్నే తీసుకోండి. ఉల్లిపాయ ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును సైతం ఉల్లి తగ్గించేస్తుంది.

గమనిక : ఇవి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన వివరాలు. పూర్తి సమాచారం కావాలన్నా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా.. ఆరోగ్య నిపుణులు సంప్రదించండి.

Tags

Read MoreRead Less
Next Story