గుడ్ ఐడియా.. బరువు తగ్గడానికి ఉల్లిపాయ.. ఎలా ఉపయోగించాలంటే..

బరువు తగ్గడానికి ఎవరెన్ని చిట్కాలు చెప్పినా పాటించాలని ఉంటుంది అధిక బరువుతో బాధ పడుతున్న వారికి. ఓ చిన్న చిట్కా అద్బుతంగా పని చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం ప్రతి రోజూ కూరల్లో వాడే ఉల్లిపాయ బరువు తగ్గడానికి పనికొస్తుందంటే ఒకింత ఆశ్చర్యంగానే ఉంటుంది.
ఉల్లిపాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ప్రీబయోటిక్ ఆహారం. ఇది బరువు తగ్గడానికి మరియు బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు త్వరగా తగ్గడానికి ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. వీటిని అనేక మార్గాల్లో తీసుకోవచ్చు. రసం తీసుకుని తాగడం లేదా సూప్గా చేసుకోవడం వంటివి చేయొచ్చు.
ముందుగా ఉల్లిపాయలో ఉన్న పోషక గుణాలు చూద్దాం..
ఒక కప్పు (160 గ్రాములు) తరిగిన ఉల్లిపాయలో 64 కేలరీలు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్, 0.16 గ్రాముల కొవ్వు, 2.7 గ్రాముల ఫైబర్, 1.76 గ్రాముల ప్రోటీన్, 6.78 గ్రాముల చక్కెర, మరియు విటమిన్ సి, బి -6, మాంగనీస్ ఉన్నాయి. ఇంకా కొద్ది మోతాదులో కాల్షియం, ఇనుము, ఫోలేట్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, కెరొటిన్, సల్ఫర్ కూడా ఉన్నాయి.
ఇక బరువు తగ్గేందుకు ఉల్లిపాయలను ఎలా ఉపయోగించాలి:
1. ఉల్లిపాయ రసం
కావలసినవి.. ఉల్లిపాయ: 1, 3 కప్పుల నీరు
తయారీ విధానం: ఉల్లిపాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి నీళ్లు పోసి మరిగించాలి. 3-4 నిమిషాల తరువాత క్రిందికి దించి చల్లారనిచ్చి మిక్సీ చేయాలి. ఇప్పుడు మరో రెండు కప్పుల నీరు కలిపి వడకట్టి తాగాలి.
2. ఉల్లిపాయ సూప్
కావాల్సినవి:
6 పెద్ద ఎర్ర ఉల్లిపాయలు
3 తరిగిన టమోటాలు
1 కప్పు తురిమిన క్యాబేజీ
4 కప్పుల కూరగాయ లేదా చికెన్ స్టాక్
2 వెల్లుల్లి రెబ్బలు.. 2 లవంగాలు
అల్లం చిన్న ముక్క
1 టీస్పూన్ నల్ల మిరియాలు
2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్
రుచికి తగినంత ఉప్పు
తయారీ విధానం: ఉల్లిపాయలపై చర్మాన్ని తొలగించి ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు, ఒక సూప్ పాట్ తీసుకొని దానిలో ఆలివ్ ఆయిల్ జోడించండి. అల్లం మరియు వెల్లుల్లి వేసి వేయించాలి వాటిని 2 నిమిషాలు వేగనిచ్చి ఉల్లిపాయల ముక్కలు, కూరగాయల ముక్కలు వేయాలి. 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు, కూరగాయల లేదా చికెన్ స్టాక్, నల్ల మిరియాలు, ఉప్పు కలిపి మరో 15 నిమిషాలు ఉడికించాలి. ఈ సూప్‌ను వేడి వేడిగా తీసుకుంటే రుచిగా ఉంటుంది. మీ బరువు తగ్గించడంలో బ్రహ్మాండంగా పని చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com