Health Message: పాలక్, పనీర్ కలిపి తింటున్నారా.. న్యూట్రీషియనిస్టులు ఏం చెబుతున్నారంటే..

Health Message: "ఆరోగ్యకరమైన ఆహారం అంటే సరైన ఆహార పదార్థాలను తినడం కాదు. సరైన ఆహార పదార్థాలను సరైన కలయికలో తినడం" అని పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇష్టంగా తినే రుచికరమైన, ప్రసిద్ధ వంటకం పాలక్ పన్నీర్. అయితే ఇది నిజంగా ఆరోగ్యకరమైన ఆహార కలయిక కాదు అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా కాల్షియం మరియు ఐరన్‌ల కలయిక సరికాదని నిపుణుల అభిప్రాయం.
ఈ రెండింటిని కలిసి తిన్నప్పుడు "ఒకదానికొకటి పోషకాల శోషణను నిరోధిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలకూరలో ఐరన్, పనీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటాయి. "ఈ రెండు ఆహార పదార్థాలను కలిపి తిన్నప్పుడు, కాల్షియం ఇనుము యొక్క పోషక శోషణను నిరోధిస్తుంది. కాబట్టి, పాలక్-ఆలూ లేదా పాలక్ -మొక్కజొన్న కలిపి తీసుకుంటే ఉపయోగం ఉంటుందని సూచిస్తున్నారు. "అందుకే ఐరన్ సప్లిమెంట్లను పాలు, టీ, కాఫీ లేదా ఇతర పాల ఉత్పత్తులతో తీసుకోకూడదు. బీన్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, అందుకే పెరుగులో చోలే, రాజ్మా, పప్పు వంటివి కలిపి తినకూడదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com