Pani Puri : వావ్ పానీపురితో బరువు తగ్గొచ్చట.. ఐడియా బావుంది కదా!!

Pani Puri : వావ్ పానీపురితో బరువు తగ్గొచ్చట.. ఐడియా బావుంది కదా!!
Pani Puri : భారీగా పెరిగిన బరువును తగ్గించుకోవాలంటే నోరు కట్టేసుకోవాలంటారు..

Pani Puri: భారీగా పెరిగిన బరువును తగ్గించుకోవాలంటే నోరు కట్టేసుకోవాలంటారు..వావ్ పానీపురితో బరువు తగ్గొచ్చట.. ఐడియా బావుంది కదా!!భారీగా పెరిగిన బరువును తగ్గించుకోవాలంటే నోరు కట్టేసుకోవాలంటారు.. ఇష్టమైన ఫుడ్స్‌ని ఎన్నింటినో పక్కన పెట్టాలంటే కొంచెం కష్టం కదా.. మరి మీ లైక్డ్ ఫుడ్ జాబితాలో కచ్చితంగా పానీపురీ ఉండే ఉంటుంది. దాన్ని మీ డైట్ మెనూలో నుంచి స్కిప్ చేయకుండా శుభ్రంగా లాగించేయొచ్చంటున్నారు డైటీషియన్లు..

బరువు తగ్గించుకోవాలంటే చాలా ఫుడ్‌లకు చెక్ పెట్టాలి. ఇష్టమైన పిజ్జాలు, బర్గర్‌లు, చాట్‌లు ఇలా అన్నీ. కానీ అందరూ ఇష్టపడే పానీపురీకి మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్లు లేవు. నిపుణులు నిరభ్యంతరంగా పానీపురీ తినొచ్చని సలహా ఇస్తున్నారు.

అవును, మీరు చదివింది నిజమే. బరువు తగ్గించే ఆహారంలో పానీపూరీ నిజంగా సంతోషించ తగ్గ విషయమే మరి. ప్రముఖ డైటీషియన్ గరిమా జంక్ ఫుడ్‌లతో పోలిస్తే పానీ పూరీ చాలా ఆరోగ్యకరమైన ట్రీట్ అని అంటారు. వీలైతే ఇంట్లోనే పూరీని తయారు చేసుకోమంటున్నారు. తక్కువ నూనెతో పరిశుభ్రంగా ఉంటుంది. ఇక వీటిలో స్టఫింగ్ కోసం

బంగాళదుంపలు తక్కువగా ఉపయోగించి, ఆరోగ్యకరమైన మరే ఇతర కూరగాయలతో కూడా వాటిని భర్తీ చేయవచ్చు అని డైటీషియన్ సూచించారు. ఇది ప్రోటీన్‌తో కూడి ఉండి'పోషకపరంగా మరింత మెరుగ్గా' చేస్తుంది.

పానీపురీలో ఉపయోగించే పానీలో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు ఉపయోగించాలి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు ఇంట్లో పానీని తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచింది. నీటి తయారీలో ఉపయోగించే చింతపండు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఇనుము యొక్క గొప్ప మూలం అని డైటీషియన్ వివరించారు.

"పుదీనా, ఇంగువ, సోపు గింజలు, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, జల్జీరా మొదలైనవి జీర్ణక్రియకు సహకరిస్తాయి. అవి అసిడిటీని ఎదుర్కోవటానికి సహాయపడతాయి. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఇవి మీ బరువు తగ్గించే లక్ష్యాలకు సులభంగా చేరుకునేందుకు ఉపకరిస్తాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు సాయింత్రమే ఓ మాంచి ఛాట్ భండార్ దగ్గరకు వెళ్లి ఓ ప్లేట్ పానీపురీ లాగించేద్దామా..

గమనిక: ఇంటర్నెట్‌లో ఎలాంటి సలహాలను గుడ్డిగా అనుసరించవద్దు. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, అర్హత కలిగిన డైటీషియన్‌ను సంప్రదించండి. సమతుల్య ఆహారం తీసుకోండి, బాగా వ్యాయామం చేయండి. మంచి నిద్ర కూడా అవసరం. అప్పుడప్పుడు మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించండి.

Tags

Read MoreRead Less
Next Story