Physical Activity: ఆరోగ్యానికి శారీరక శ్రమ.. అలవాటు చేసుకుంటే..

Physical Activity: ఆరోగ్యానికి శారీరక శ్రమ.. అలవాటు చేసుకుంటే..
Physical Activity: శారీరక శ్రమ లేదా వ్యాయామం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Physical Activity: శారీరక శ్రమ లేదా వ్యాయామం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.శారీరక శ్రమ దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరీ ముఖ్యంగా, రెగ్యులర్ యాక్టివిటీ మీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు.. నడక లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం ఆరోగ్యంగా, మెదడు చురుకుగా పనిచేస్తుంది.

శారీరక శ్రమ యొక్క ప్రయోజనాలు

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది

బరువును నియంత్రిస్తుంది

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి

టైప్ 2 డయాబెటిస్ మరియు కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

తక్కువ రక్తపోటు కలిగి ఉంటారు

కండరాలు, కీళ్ళ నొప్పులు తక్కువగా ఉంటాయి.

వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. డిప్రెషన్‌తో బాధపడేవారికి వ్యాయామం ఒక మంచి ఔషధం. వ్యాయామం ప్రతికూల ఆలోచనలను నిరోధిస్తుంది.

ఇతరులతో కలిసి వ్యాయామం చేయడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి.

ఫిట్‌నెస్ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

వ్యాయామం మీ మెదడులోని సెరోటోనిన్, ఎండార్ఫిన్లు మరియు ఒత్తిడి హార్మోన్ల వంటి రసాయనాల స్థాయిలను కూడా మార్చవచ్చు.

ముందుగా మీ వైద్యుడిని సంప్రదించండి..

శారీరక శ్రమ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ వైద్యుడిని చూడటం మంచిది:

మీరు 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారైతే.. అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇంతకు ముందు శారీరక శ్రమకు సంబంధించిన ఏ వ్యాయామాలు చేయనట్లైతే ఒక్కసారే ఎక్కువ సేపు శ్రమ చేయడం మంచిది కాదు. ఇది మీ ఛాతీలో నొప్పిని కలిగిస్తుంది. కళ్లు తిరిగినట్లు ఉంటుంది. మితమైన శారీరక శ్రమ మిమ్మల్ని ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది.

నడక, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా ఏదైనా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గంట కంటే ఎక్కువ సేపు కూర్చొని ఉండడం మంచిది కాదు.. ప్రతి గంటకు ఓ ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకుని నడవడం మంచిది. ఇంట్లో అయినా ఆఫీస్ లో అయినా.

Tags

Read MoreRead Less
Next Story