Pregnant after 40: 40 దాటిన తరువాత గర్భం.. గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు..

Pregnant after 40: 40 దాటిన తరువాత గర్భం.. గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు..
Pregnant after 40: చదువు, కెరీర్, కొంతైనా ఆర్థిక భద్రత లేనిదే ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ వివాహం చేసుకోవడానికి ముందుకు రావట్లేదు..

Pregnant after 40: చదువు, కెరీర్, కొంతైనా ఆర్థిక భద్రత లేనిదే ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ వివాహం చేసుకోవడానికి ముందుకు రావట్లేదు.. ఒకప్పుడు 18ఏళ్లు దాటితే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టేవారు.. కనీసం 21 ఏళ్లు వచ్చేసరికి పెళ్లిళ్లు చేసుకునేవారు.. కానీ ఇప్పుడు ముఫ్పైకి దగ్గరలో ఉన్నా మూడు ముళ్ల గురించి ఆలోచించట్లేదు..

కెరీర్, ఉద్యోగము ముందు, ఆ తర్వాతే పెళ్లి అంటున్నారు నేటి యువతీ యువకులు.. దీంతో పిల్లలు కనడం కూడా పోస్ట్ పోన్ అవుతుంది.. సెటిల్ అయిన తరువాతే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. అయితే మరీ 40 ఏళ్లు వచ్చిన తరువాత పిల్లల్ని కనడం అంటే కొంచెం రిస్క్ తో కూడిన వ్యవహారం అని అంటున్నారు వైద్యులు. అన్ని కేసుల్లో అది సక్సెస్ అవుతుందని చెప్పలేము.. 40ల్లో గర్భం వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో వివరిస్తున్నారు..

మీకు 40 ఏళ్లు పైబడి ఉంటే, మీకు బిడ్డ పుట్టినట్లయితే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు. మీరు 20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే మీకు ఏమీ తెలియక పోవచ్చు. అదే 40 ల్లో ఉంటే చాలా వాటి మీద మీక ఒక అవగాహన వస్తుంది. మీ బలాలు, మీ బలహీనతలు మీకు బాగా తెలుసు. దాంతో బిడ్డను జాగ్రత్తగా పెంచుతారు.

40 ఏళ్లు పైబడిన చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన శిశువులను ప్రసవిస్తున్నారు. కానీ మీరు ఆలోచించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

ప్రసూతి సంరక్షణ

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసూతి సంరక్షణ అనేది మిమ్మల్ని, మీ పెరుగుతున్న బిడ్డను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం. డాక్టర ని క్రమం తప్పకుండా కలవాలి. వారు ఇచ్చిన సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలి.

మీకు అవసరమైన శారీరక పరీక్ష, రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ ద్వారా , గర్భంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు.

గర్భిణీ స్త్రీలు పాటించవలసిన ముఖ్య విషయాలు..

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ డి సప్లిమెంట్స్

ధూమపానం , మద్యపానం, మాదకద్రవ్యాలను మానివేయడం

స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం

వ్యాయామం, నిద్ర, ప్రయాణం వంటి ఇతర అంశాల గురించి చర్చించవచ్చు.

40 ఏళ్లు పైబడిన స్త్రీలు గర్భం దాలిస్తే..

గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్లాసెంటా ప్రేవియాను కలిగి ఉంటుంది , దీనిలో మావి గర్భాశయంలోని తప్పు భాగంలో అభివృద్ధి చెందుతుంది

అధిక రక్తపోటు లేదా గర్భధారణ మధుమేహం

అకాల ప్రసవం

కవలలు ఇద్దరు లేదా ముగ్గురు పుట్టే అవకాశం

కాబట్టి మంచి డాక్టర్ పర్యవేక్షణ మరింత ముఖ్యం

జన్యు పరిస్థితులు

డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన పరిస్థితి ఉన్న పిల్లలు పుట్టే అవకాశం 40 దాటిన స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.

మీరు ముందస్తు అల్ట్రాసౌండ్ మరియు రక్త పరీక్ష వంటి స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకుని కడుపులోని బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదల గురించి తెలుసుకోవచ్చు.

ఏదైనా సమస్య ఉన్నట్లు అనిపిస్తే డాక్టర్ సలహా మేరకు మరికొన్ని పరీక్షలను చేయించుకోవచ్చు .

మీరు జెనెటిక్ కౌన్సెలింగ్‌ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ స్పెషలిస్ట్ కౌన్సెలర్ మీ కుటుంబం గురించి మీతో మాట్లాడతారు. మీ వయసు, మీ ఆరోగ్యం మీ బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వివరిస్తారు. మీరు ఆ పరిస్థితిని ఎలా నిర్వహించవచ్చు అనే దాని గురించి మీకు ప్రత్యేకంగా వివరిస్తారు. దానిని బట్టి మీరు ముందడుగు వేయవచ్చు.

గమనిక: ఇది నెట్ లో దొరికిన సమాచారం.. మీకు అవగాహన కల్పించడం కోసం రాసింది మాత్రమే. మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ చెప్పినట్లు నడుచుకోవడం ముఖ్యం.

Tags

Read MoreRead Less
Next Story