40 ఏళ్ల వయసులో గర్భధారణ.. ఆరోగ్య ప్రమాదాలు

40 ఏళ్ల వయసులో గర్భధారణ.. ఆరోగ్య ప్రమాదాలు
40 లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో ఉన్నప్పుడు బిడ్డను కనాలనుకోవడం సముచితం కాదంటున్నారు వైద్యులు.

40 ఏళ్ల తర్వాత బిడ్డను పొందాలనుకుంటే మీకు, మీ బిడ్డకు ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయి. 40 ఏళ్ల తర్వాత గర్భం ధరించడం మహిళలకు కూడా చాలా సవాలుగా ఉంటుంది.

గర్భం దాల్చడంలో సవాళ్లు

40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం కష్టం. ఇది కొన్ని సవాళ్లతో కూడుకొని ఉంటుంది. అండాశయాలతో జన్మించిన వ్యక్తులు పుట్టుకతో పరిమితమైన గుడ్లను కలిగి ఉంటారు. 35 తర్వాత వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మీ వయస్సు పెరిగేకొద్దీ ఎండోమెట్రియోసిస్ లేదా యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి సంతానోత్పత్తిని ప్రభావితం చేసే రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.

20 ఏళ్లలోపు గర్భం దాలిస్తే గర్భస్రావం ప్రమాదం 10% ఉంటే, 40 ఏళ్లలో గర్భందాల్చిన వ్యక్తుల్లో గర్భస్రావ ప్రమాదం 53% వరకు ఉంటుంది. 45 ఏళ్ల తర్వాత, మీరు సహజంగా గర్భవతి అయ్యే అవకాశం లేని స్థాయిలో సంతానోత్పత్తి క్షీణిస్తుంది. మీరు 40 ఏళ్ల తర్వాత గర్భవతి కావాలనుకుంటే, మీ సంతానోత్పత్తి స్థాయి, ఆరోగ్య ప్రమాదాలను అంచనా వేయడానికి గైనకాలజిస్ట్ ని సంప్రదించాలని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) సిఫార్సు చేస్తోంది.

IVF వంటి పద్ధతుల విజయాల రేటు కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది. ACOG ప్రకారం, 41-42 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు IVF ద్వారా ప్రత్యక్ష ప్రసవాన్ని సాధించే అవకాశం 12% మరియు 43-44 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 5% అవకాశం కలిగి ఉంటారు.

వయస్సు-సంబంధిత గర్భధారణ ప్రమాదాలు

40 ఏళ్ల తర్వాత గర్భం ధరించడం వల్ల గర్భధారణ సమయంలో మధుమేహం, రక్తపోటు, ప్రీఎక్లాంప్సియా వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. 2016 అధ్యయనంలో 40 ఏళ్లు పైబడిన గర్భిణీలలో 35 ఏళ్లలోపు వ్యక్తులతో పోలిస్తే మధుమేహం వచ్చే ప్రమాదం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఇక అధిక రక్తపోటు రుగ్మత, ఇది తల్లికి, బిడ్డకు ప్రాణాంతక సమస్యగా మారుతుంది.

40 పైబడిన ప్రసవం

40 ఏళ్లు పైబడిన గర్భిణీలు ముందుగానే ప్రసవించే అవకాశం ఉంది లేదా సి-సెక్షన్ అవసరం అవుతుంది.

సి-సెక్షన్ పెద్ద శస్త్రచికిత్స అయినందున, దీని నుంచి కోలుకోవడానికి ఎక్కువ రోజులు పడుతుంది. సి-సెక్షన్ చేయించుకోవడం వలన రక్త నష్టం, ఇన్ఫెక్షన్ లేదా రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా పెరుగుతుంది. 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు సహజంగా గర్భం ధరించే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి, చాలామంది గర్భం దాల్చడానికి IVFని ఉపయోగిస్తారు. దీని వలన కవలలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

40 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన పరిస్థితులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ACOG ప్రకారం, డౌన్ సిండ్రోమ్ అనేది అత్యంత సాధారణ క్రోమోజోమ్ పరిస్థితి.

నెలలు నిండని పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెలలు నిండని శిశువులకు శ్వాస సమస్యలు, మస్తిష్క పక్షవాతం, అభివృద్ధి ఆలస్యం, వినికిడి సమస్యలు, దృష్టి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

అధిక బరువుతో పుట్టే అవకాశం 15.4% ఉందని పరిశోధనలో తేలింది. పిండం ఎదుగుదల పరిమితి ఉన్న పిల్లలు శ్వాసకోశ సమస్యలు, కంటి అభివృద్ధి సమస్యలు, ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

40 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆలోచించడం చాలా బాధగా అనిపించవచ్చు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత ప్రమాదం మరియు గర్భం ప్రత్యేకమైనది.

40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం సవాలుగా ఉన్నప్పటికీ, IVF వంటి పునరుత్పత్తి సాంకేతికతలో పురోగతి, సరోగసీని ఉపయోగించడం వల్ల తల్లిదండ్రులకు గర్భం, ప్రసవం సాధ్యమవుతుంది.

మీరు 40 ఏళ్ల తర్వాత గర్భవతి కావడానికి సిధ్దపడితే ముందుగానే మీ ఫ్యామిలీ వైద్యులను సంప్రదించడం అత్యవసరం.

Tags

Read MoreRead Less
Next Story