అమ్మ కాబోతున్నారా.. అయితే ఈ ఆరు విషయాలు..

అమ్మ కాబోతున్నారా.. అయితే ఈ ఆరు విషయాలు..
ప్రతి అమ్మాయి తల్లి కావడం అనేది ఓ అదృష్టంగా భావిస్తుంది. అమ్మా అని పిలిపించుకోవాలని ఆరాట పడుతుంది..

ప్రతి అమ్మాయి తల్లి కావడం అనేది ఓ అదృష్టంగా భావిస్తుంది. అమ్మా అని పిలిపించుకోవాలని ఆరాట పడుతుంది.. ఆ అపురూప క్షణాల కోసం ఎదురు చూస్తుంటుంది. పెళ్లి తర్వాత తల్లిదండ్రుల దశలోకి ప్రవేశించడం అనేది ఓ అద్భుత అవకాశం. బిడ్డ పుట్టడానికి ముందు జాగ్రత్త వహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.

తల్లిదండ్రులుగా మారడం అంటే ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం పొందడమే. కొత్త తల్లిదండ్రులకు వారి కొత్త పాత్రలో తేలికగా సహాయపడే ఆరు ప్రాథమిక అంశాలను గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోవడంతో పాటు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలను గురించి తెలుసుకుందాం.

1) భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం..

తల్లిదండ్రుల ప్రయాణం అనేది ఆప్యాయత, ఆనందం, ఒత్తిడి వంటి భావోద్వేగాల వెల్లువ. వీటిని స్వీకరించడం చాలా అవసరం. మీ భావోద్వేగాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఇది తల్లిదండ్రులుగా మీ బంధాన్ని బలపరుస్తుంది.

2) మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి

తల్లిదండ్రులుగా మారినప్పుడు అన్ని విషయాలపట్ల కొంత జ్ఞానం అవసరం. పేరెంటింగ్ సాహిత్యం, వర్క్‌షాప్‌లు వంటి అనేక వనరులు పిల్లల అభివృద్ధికి తోడ్పడే సమాచారాన్ని అందించగలవు. ఈ సంపాదించిన జ్ఞానం మీ స్వీయ-భరోసాని పెంచుతుంది. రాబోయే సవాళ్లను పరిష్కరించడానికి మీకు తగిన నైపుణ్యాలను అందిస్తుంది.

3) ఇతరుల సహాయం తీసుకోండి

పేరెంట్‌హుడ్ అనేది ఒక్కరే చేసే పనికాదు. ఏదైనా ఒక చిన్న సలహా లేదా సహాయం, సానుభూతి కోసం కుటుంబం, స్నేహితులు, తోటి తల్లిదండ్రుల మద్దతు అవసరం. అదే ప్రయాణంలో నడుస్తున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి తల్లిదండ్రుల కమ్యూనిటీలలో పాల్గొనండి. ఈ దృఢమైన సపోర్ట్ మీకు మంచి అనుభూతిని అందిస్తుంది.

4) మీ ఇంటిని సిద్ధం చేయండి

కొత్త వ్యక్తిని మీ కుటుంబంలోకి స్వాగతించడం వలన మీ ఇంట్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసి ఉంటుంది. మీ పిల్లల కోసం సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సిద్ధంకండి. పిల్లలకు అవసరమైన డైపర్‌లు, దుస్తులు, వారికి ఫీడ్ చేసే వస్తువులు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ నీట్ గా ఎక్కడివి అక్కడ ఉంటే చిన్నారులతో నిద్ర లేని రాత్రులు గడిపిన అమ్మకు నీరసం రాకుండా ఉంటుంది. ఇవి మీ దినచర్యలో మార్పును సులభతరం చేస్తుంది.

5) ఆర్థిక ప్రణాళికను రూపొందించండి

పేరెంట్‌హుడ్ చాలా బాధ్యతలను తీసుకువస్తుంది. పిల్లల పెంపకంతో ముడిపడి ఉన్న అదనపు ఖర్చులకు అనుగుణంగా మీ బడ్జెట్‌ను పరిశీలించి, అవసరమైన విధంగా సర్దుబాటు చేసుకోవాలి. వైద్య ఖర్చులు, పిల్లల సంరక్షణ ఖర్చులను ముందుగానే ఊహించి అందుకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిను ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ కుటుంబానికి స్థిరమైన భవిష్యత్తును అందిస్తుంది.

6) అన్నిటికంటే ముఖ్యం సహనం

పరిస్థితులు ఎల్లప్పుడూ ఊహించినట్లుగా ఉండవు. మీరు నిద్ర లేమి రాత్రులు, ఫీడింగ్ షెడ్యూల్స్ కొంత మీకు అసహనాన్ని కలిగిస్తాయి. చిన్నారులను నిద్ర పుచ్చే టైమ్ లో మీరు కూడా నిద్ర పోవడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, మీకు ఇష్టమైన మంచి సంగీతం వినడం, కుటుంబసభ్యులతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం ముఖ్యం.

తల్లిదండ్రులుగా మీ ప్రతి ప్రయాణం ప్రత్యేకమైనదని గుర్తుంచుకోండి. మీరు ఈ క్షణాలను విలువైనవిగా పరిగణించండి. అమ్మతనాన్ని ఆస్వాదించండి.

Tags

Read MoreRead Less
Next Story