Queen Elizabeth II 'special' Dish: రాణిగారి హెల్త్ సీక్రెట్.. 91 ఏళ్లుగా ఆమె కోసం ఓ 'స్పెషల్ డిష్'..

Queen Elizabeth II 'special' Dish: UK యొక్క సుదీర్ఘకాలం పనిచేసిన చక్రవర్తి, క్వీన్ ఎలిజబెత్ II సెప్టెంబర్ 8, 2022న 96 సంవత్సరాల వయస్సులో బాల్మోరల్‌లో మరణించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆహారం, వ్యాయామంపై పూర్తి నియంత్రణతో అద్భుతమైన జీవితాన్ని గడిపింది.
96 సంవత్సరాల వయస్సు వరకు ఆమెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించిన గొప్ప వైద్యులతో పాటు రాణి గారి కోసం ప్రత్యేక మెనూ తయారు చేసిన పాక సిబ్బందికి కూడా సమాన అర్హత ఉంది. క్వీన్ ఎలిజబెత్ ప్రతిరోజూ ఒకే రకమైన ఆహార పదార్థాలను ఇష్టపడుతుందని ఆమె వ్యక్తిగత చెఫ్, డారెన్ మెక్‌గ్రాడీ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. రాణి తన భోజనం కోసం ప్రతిరోజూ ఒకే ఆహార పదార్థాన్ని తింటుందని చెప్పారు.
గత 91 ఏళ్లుగా క్వీన్ ఎలిజబెత్ 'ప్రత్యేక మెనూ'
ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ విలియం మరియు ప్రిన్స్ హ్యారీతో పాటు క్వీన్ ఎలిజబెత్ IIకి వ్యక్తిగతంగా సుదీర్ఘకాలం పనిచేసిన చెఫ్ డారెన్ మెక్‌గ్రాడీ, ఒకసారి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు.
ఆమె సాధారణ వంటకాలను ఇష్టపడుతుంది. దాదాపు ప్రతిరోజూ ఎర్ల్ గ్రే టీ, ఒక కప్ తృణధాన్యాలు తీసుకుంటుంది. దానితో పాటు, క్వీన్ జీవించి ఉన్నంతకాలం తనకు ఎంతో ఇష్టమైన 'జామ్ పెన్నీ' శాండ్‌విచ్‌ను తినేవారు అని చెఫ్ మెక్‌గ్రాడీ తెలిపారు.
క్వీన్స్ ఫేవరెట్ శాండ్‌విచ్ గురించి మాట్లాడుతూ.. ఇది బ్రెడ్, బటర్, జామ్ అనే మూడు వస్తువులను మాత్రమే కలిగి ఉన్న సాధారణ వంటకం. బాల్మోరల్ కాజిల్‌లో తోటలోని చక్కటి స్కాటిష్ స్ట్రాబెర్రీలతో ఈ శాండ్‌విచ్ తయారు చేసి రాణిగారికి అందించేవారం అని ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com