Monsoon 2023 : ఈ ఏడాది సాధారణ వర్షపాతం

Monsoon 2023 : ఈ ఏడాది సాధారణ వర్షపాతం
X

ఈ ఏడాది నైరుతీ రుతుపవనాల వల్ల వర్షపాతం సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఐతే.. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటాయని ప్రైవేట్‌ వాతావరణ సంస్థ స్కయ్‌నెట్‌ పేర్కొంది. ఎల్‌నినో కారణంగా సాధారణ వర్షపాతం ఉండదని తెలిపింది.అయితే 24 గంటల్లోనే దీనికి భిన్నంగా భారత వాతావరణ శాఖ రుతుపవనాలపై అంచనా ఇచ్చింది. దీర్ఘకాలిక సగటులో 96 శాతం మేరకు ఈ ఏడాది వర్షపాతం ఉంటుందని పేర్కొంది. అయిదు శాతం అటు, ఇటుగా ఉండొచ్చని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ద్వితీయర్ధంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, అయితే దీని వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పలేమని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

Tags

Next Story