వానకాలంలో కాకరకాయ తినొచ్చా..!

వానకాలంలో కాకరకాయ తినొచ్చా..!

కాకరకాయ ఫైల్ ఫోటో

Rainy Season: వర్షాకాలంలో వేడివేడి మిర్చి బజ్జీలు, మొక్కజొన్న పొత్తులు, టీ, కాఫీ ఇలాంటివి లేకపోతే చాలా మందికి రోజు గడవదు వర్షాకాలంలో పలు ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి.

వర్షాకాలంలో వేడివేడి మిర్చి బజ్జీలు, మొక్కజొన్న పొత్తులు, టీ, కాఫీ ఇలాంటివి లేకపోతే చాలా మందికి రోజు గడవదు వర్షాకాలంలో పలు ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ కరోనా కాలంలో మనం తినే ఆహారంలో ఇమ్యూనిటీ బూస్టింగ్ గా ఉండాలి. వీటన్నింటి తో ఈ పదార్థాలు కూడా తీసుకోండి.

నీరు

నీరు తాగాలి.. నీటిని కాచి చల్లార్చి కానీ ఫిల్టర్ చేసి కానీ తాగాలి. నీరు మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. మీకు కావాలనుకుంటే ఆరెంజ్, కీరా, పుదీనా కూడా మీరు తాగే నీటికి కలుపుకుని తాగవచ్చు.

వెల్లుల్లి

ప్రతి ఇంట్లో కిచెన్‌లోనూ ఉండే వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వంటి దినుసులు మనని కామన్ కోల్డ్, ఫ్లూ నించి ప్రొటెక్ట్ చేస్తాయి.మనిషి బాడీలో మెటబాలిజంని మెయింటెయిన్ చేసే సూపర్ ఫుడ్స్‌లో వెల్లుల్లి కూడా ఒకటి. పప్పు, రసం, సాంబారు, సాస్ వంటి వాటిలో వెల్లుల్లిని కలపడం ద్వారా మనం దీని రోజూ తీసుకోగలం.

మెంతికూర,

మెంతికూర, కాకర కాయ వంటి వాటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నీటి ద్వారా, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులని అడ్డుకునే శక్తి మనకి వస్తుంది. ఇవి విటమిన్స్ ఏ, సీ, బీ, ఐరన్, జింక్‌తో నిండి ఉంటాయి.

పెరుగు

గట్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఒక ప్రోబయాటిక్ ఇంగ్రీడియెంట్ మీ ఆహారంలో ఉండి తీరాలి. ఇది పాథోజెన్స్ ని దూరంగా ఉంచుతుంది. పెరుగు లో ఉండే మంచి బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్స్ హి హెల్దీగా ఉంచుతుంది.

తేనె

తేనె అరుగుదలకి సహకరిస్తుంది, బాడీకి కావాల్సిన శక్తినిస్తుంది. అంతే కాక తేనెలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉండడం వలన తేనె తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story