Coffee Benefits: కాఫీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. రోజుకి 2 కప్పుల కాఫీ తాగితే..

Coffee Benefits: కాఫీ ప్రియులకు నిజంగా ఇది శుభవార్తే. ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీ పడితేనే బుర్ర పని చేస్తుంది. పనులు చక చకా చేయాలనిపిస్తుంది కాఫీ ప్రియులకు. ఒక కప్పు కాఫీ అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని పరిశోధకులు కూడా చెబుతున్నారు.
తాజా పరిశోధనల ప్రకారం కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. ఈ అధ్యయనం 'ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్'లో ప్రచురించబడింది.
ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవాన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 200 మందిపై పదేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల్లో అధికంగా కాఫీ తాగే వారిలో అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా తలెత్తుతాయని గుర్తించారు. ఈ అధ్యయనాల్లో కాఫీకి, జ్ఞాపకశక్తికి మధ్య సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు.
అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధికి కీలకమైన అమిలాయిడ్ ప్రోటీన్‌ని నిరోధించడంలో కాఫీ ఎక్కువగా సహాయపడుతుందని డాక్టర్ గార్డనర్ వివరించారు. అల్జీమర్స్ వ్యాధి ఆగమనాన్ని ఆలస్యం చేయడంలో కాఫీ సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఇంట్లో తయారు చేసిన కప్పు కాఫీ 240 గ్రా అయితే, రోజుకు రెండు కప్పులు తీసుకోవడం ద్వారా మతిమరుపును నివారించ వచ్చు అని డాక్టర్ గార్డనర్ చెప్పారు.
మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపించే అంశాలు కాఫీలో ఏ భాగాలు ఉన్నాయనేది పరిశోధకులు ఇంకా ఖచ్చితంగా గుర్తించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com