Rice Mask: అన్నం మాస్క్‌తో జుట్టు ఆరోగ్యంగా.. వారానికి ఒకసారి ఇలా చేస్తే..

Rice Mask: నల్లగా, ఒత్తుగా ఉన్న నిగనిగలాడే కురులంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. జుట్టును కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బజార్లో దొరికే షాంపూలన్నీ ట్రై చేసినా రాలే వెంట్రుకలను ఆపలేం. మంచి పోషకాలతో కూడిన ఆహారం, వేళకు నిద్ర, శరీరానికి కొద్దిపాటి వ్యాయామం ఇవి కూడా జుట్టు మీద ప్రభావం చూపుతాయి. అనేక హోం రెమెడీలు ఉన్నప్పటికీ, అన్నం మాస్క్ జుట్టుకు అద్భుతంగా పని చేస్తుంది. ఇది జుట్టును దాని మూలాల నుండి రక్షిస్తుంది. జుట్టుకు కావలసిన పోషణను అందిస్తుంది. చిట్లిన వెంట్రుకలను మరమ్మత్తు చేస్తుంది.
ఇది జుట్టు యొక్క మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది స్కాల్ప్ యొక్క pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మరియు జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తుంది. బియ్యం జుట్టు పెరుగుదలను, మెరుపును పెంచుతుంది, వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి సహాయం చేస్తుంది. చుండ్రుతో పోరాడుతుంది.
కావలసినవి:
- 1/4 కప్పు వండిన అన్నం
- అలోవెరా జెల్
- మీకు ఇష్టమైన ఆయిల్ 3 స్పూన్లు
- మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ (ఇది ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు)
విధానం:
మిక్సర్‌లో ఉడికించిన అన్నం, కలబంద రసం, ఆయిల్‌ని వేసి మెత్తని పేస్ట్ మాదిరి అయ్యే వరకు మిక్సీ చేయాలి.
దీనికి, మీకు ఇష్టమైన నూనె 2-3 చుక్కలను వేసి బాగా కలపాలి.
కనీసం 30 నిమిషాల పాటు హెయిర్ మాస్క్‌ని అప్లై చేయండి. మీరు దీన్ని రాత్రిపూట తలకు పట్టించి వదిలివేసినప్పుడు ఫలితం ఇంకా బాగుంటుంది.
మరుసటి రోజు ఉదయం షాంపూతో కడిగేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి జుట్టుకు అప్లై చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com