Health Fitness : వ్యాయామం శృతిమించితే అంతే..

Health : అతి వ్యాయామం మంచిది కాదు. ఏదయినా అతి చేస్తే అనారోగ్యానికి అనర్ధాలకు దారి తీస్తుంది. ప్రతీ రోజూ వ్యాయామంతో శరీరం ఆరోగ్యంగా అందంగా ఉండడంతో పాటు మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం ఇంకాస్త చేయగలను అనే దశలోనే ఆపివేయాలి. ఒక్కరోజులో ఏదీ సాధించలేము.
శరీరం వ్యాయామానికి తట్టుకొని మార్పు చెందాలంటే కొంత సమయం పడుతుంది. కొందరు టౌర్నమెంటు పోటీలకు సిద్ధమవుతున్నట్లుగా వ్యాయామం చేస్తారు. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇటీవళ కన్నడ సూపర్ స్టార్ చిన్న వయసులోనే గుండెపోటుకు గురై చనిపోయారు. శృతిమించిన వర్కౌట్సే దీనికి కారణం అని తరువాత డాక్టర్లు నిర్ధారించారు.
వ్యాయామం శృతి మించినప్పుడు నోరు ఎండిపోవడం, శరీరం చల్లగా అయిపోవడం, తీవ్రమైన ఆయాసం, కొన్ని శరీర భాగాలు వణకటం, వికారం కలుగుతాయి. ఈ లక్షణాలు వచ్చేవరకు వ్యాయామం చేయడం ప్రమాదమే. ఈ లక్షణాలు వస్తే తక్షణం వ్యాయామం ఆపివేయాలి.
వ్యాయామం చేసేటప్పుడు మధ్యమధ్యలో కొన్ని నీళ్లు తాగండి. షుగర్, బీపీ ఉన్నవారు పల్లీ పట్టీ, ఎండు కర్జూరం లాంటివి తినవచ్చు, ఇవి మీకు ఇన్స్‌టాంట్ ఎనర్జీని ఇస్తాయి. రాత్రి మధ్యం తాగితే ఉదయం హెవీ వ్యాయామం చేయకూడదు.
వ్యాయామాలు మితిమీరితే దీర్ఘకాలికంగా అనర్ధాలకు ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. బరువు పెరగడం, కండరాల నొప్పి, నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం, మానసిక సమస్యలు లాంటివి కలుగుతాయి. ఇవి రాకుండా ఉండాలంటే పరిమితమైన వ్యాయామం మాత్రమే చేయాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com