కరోనా రోగుల చికిత్సలో 'coronaid' పాత్ర.. మార్కెట్లో మరో ఔషధం

కరోనా రోగుల చికిత్సలో coronaid పాత్ర.. మార్కెట్లో మరో ఔషధం
మార్కెట్‌లో తక్కువ ధరకే ఒక సాధారణ ఔషధాన్ని తీసుకొస్తున్నామని, దీంతో కరోనా వైరస్ రోగులకు ఉపశమనాన్ని అందించవచ్చని 'coronaid' ఔషధ తయారీ దారులు చెబుతున్నారు..

మార్కెట్‌లో తక్కువ ధరకే ఒక సాధారణ ఔషధాన్ని తీసుకొస్తున్నామని, దీంతో కరోనా వైరస్ రోగులకు ఉపశమనాన్ని అందించవచ్చని 'coronaid' ఔషధ తయారీ దారులు చెబుతున్నారు. దీన్ని కరోనా లక్షణాలు ఉన్న రోగులకు అందిస్తే వ్యాధి తీవ్రతను అరికట్టవచ్చని అంటున్నారు. ఈ ఔషధానికి CCMB రీసెర్చ్ తోపాటు గుర్తింపు లభించిందని సంస్థ పేర్కొంది. శరీరంలోని సైటోకైన్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లోని సిలియాను సంరక్షించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. ఈ మెడిసిన్ కు ప్రముఖ హెర్బల్ ఉత్పత్తుల సంస్థ NuZen వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. నిజానికి కరోనా వైరస్ సోకిన ప్రతి 20 మందిలో 19 మంది ఆస్పత్రిలో చేరకుండానే కోలుకుంటారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నా వైద్యం అందడంతో కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇతర అనారోగ్య సమస్యలు, వయసు, వృద్ధాప్యం కోవిడ్ మరణాలకు కారణమవుతున్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినప్పడు వైరస్ వ్యాధులు ఇబ్బందికి గురి చేస్తాయి.

ప్రతి వెయ్యి కరోనావైరస్ కేసుల్లో తొమ్మిది మంది అంటే దాదాపు ఒక శాతం మంది బాధితులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. బాధితుల వయసు, లింగం, ఆరోగ్య స్థితి, వారు నివసించే ప్రాంతంలో ఉండే ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ లాంటి అంశాలపై కోవిడ్19 మరణాల రేటు ఆధారపడి ఉంటుంది. ఏదైనా వైరస్ వ్యాపించినప్పుడు అది సోకిన ప్రతి ఒక్కరూ వైద్యులను సంప్రదించరు. అత్యధిక వైరస్‌ల విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. వైరస్ సోకిన లక్షణాలు తక్కువ స్థాయిలో ఉంటే అత్యధికులు వైద్యులను సంప్రదించరు. అందువల్ల బాధితుల లెక్కింపులో ఇలాంటి కేసులు అన్నీ పరిగణనలోకి రాకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల్లో మరణాల రేటు ఒక్కో దేశంలో ఒక్కోలా కనిపిస్తుండటానికి ఇదో ప్రధాన కారణం.

వైరస్ సోకిన లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని గుర్తించడంలో కొన్ని దేశాలు మెరుగ్గా ఉండగా, మరికొన్ని దేశాలు బాగా వెనకబడి ఉన్నాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్ జరిపిన ఓ పరిశోధనలో తేలింది. కేవలం అధికారికంగా నమోదైన కేసుల ప్రాతిపదికగానే లెక్కగట్టే మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పిల్లల్లో వాంతులు, విరేచనాలు, పొట్ట నొప్పి లాంటివి కరోనా లక్షణాలు కావచ్చని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు. యాంటీబాడీస్ ఉన్న పిల్లల్లో సగం మందికి కోవిడ్ నిర్ధారిత లక్షణాలు కూడా కనిపించాయని చెప్పారు. అయితే ఈ పిల్లల్లో ఎవరినీ ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం రాకపోవడం ఆనందించే విషయమని పరిశోధకులు తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story