Russian Beauty Tips: రష్యన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం.. ఈ 7 బ్యూటీ సీక్రెట్స్ ఎవరికైనా..

Russian Beauty Tips: రష్యన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం.. ఈ 7 బ్యూటీ సీక్రెట్స్ ఎవరికైనా..
Russian Beauty Tips: 7 బ్యూటీ చిట్కాలు రష్యన్ అమ్మాయిలు అందంగా కనిపించడంలో సహాయపడతాయి. అందరూ ఆచరిస్తే ఆరోగ్యమైన అందం సొంతమవుతుంది.

Russians Beauty Tips: వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ ఏమీ తిరగరు రష్యన్ అమ్మాయిలు.. ఇంట్లోనే సహజపద్ధతులు ఆచరించి అందాన్ని మెరుగుపరుచుకుంటారు. నేచురల్ హోం రెమిడీస్ ద్వారా సమయము, డబ్బు ఆదా అవుతుంది. వీటిని మీ దినచర్యలో భాగం చేసుకుంటే అందంతో పాటు ఆత్మవిశ్వాసమూ మీ సొంతమవుతుంది అని అందరికీ చెబుతుంటారు ఈ రష్యన్ అమ్మాయిలు.


మూలికల గురించి


రష్యాలో సౌందర్య మూలికలు సులభంగా లభిస్తాయి. అవి చాలా చౌకగా కూడా ఉంటాయి. మెడికల్ షాపుల్లో కూడా విస్తృతంగా లభ్యమవుతాయి. అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఈ తరహా పద్ధతులను, మూలికలను ఉపయోగిస్తారు. వైద్యులు కూడా వీటిని సిఫారసు చేస్తుంటారు. హెర్బల్ వస్తువులతో చేసిన డికాక్షన్‌లో పలుచని వస్త్రాన్ని ముంచి శరీరాన్ని క్లీన్ చేస్తే చర్మం పొడిబారడం లేదా జిడ్డుగా మారడం తగ్గుతుంది.

వెంటుక్రలకు మాస్క్‌లాగా ఈ మూలికల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. శరీరంలో పేరుకున్న విషవాయువులను తొలగించడానికి హెర్బల్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మంచిది కదా అని అతిగా తీసుకోకూడదు. మితంగా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి.

జుట్టు సంరక్షణ


పొడవైన జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. వత్తైన జుట్టు, నల్లని కురులు అతివల అందాన్ని ఇనుమడింపజేస్తుంది. జుట్టు సంరక్షణ కోసం ఆవ నూనె ఉపయోగిస్తారు. ఒక స్పూన్ ఆవ నూనె తీసుకుని జుట్టుకి కుదుళ్ల నుంచి మసాజ్ చేయాలి.. ఒక గంట తరువాత సాధారణ షాంపూతో తల స్నానం చేయాలి.

ఆవిరి పట్టడం


చర్మంపైన పేరుకున్న మురికిని తొలగించడానికి ఆవిరి నిండిన గదుల్లో ఉంటారు. ఆ వేడికి చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. శరీరం నుంచి చెమట రూపంలో టాక్సిన్స్ బయటకు వెళతాయి. ఈ ఆవిరి గదులను రష్యన్లు బన్యాస్ అని పిలుస్తారు. ఆవిరి పట్టిన తర్వాత చర్మం చాలా మృదువుగా, లేతగా అనిపిస్తుంది.

ఫేస్ మాస్క్


రష్యాలో చాలా బ్యూటీ ఉత్పత్తులు ఇంట్లో వాడే సహజ పదార్థాలతోనే తయారు చేస్తారు. వేసవికాలంలో ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం స్ట్రాబెర్రీ మాస్క్‌ని ఉపయోగిస్తారు. తోట నుండి అప్పుడే కోసుకొని వచ్చిన స్ట్రాబెర్రీని ఎంచుకుని వాటితో ముఖం మీద రబ్ చేస్తారు. వారానికి ఒకసారి స్ట్రాబెర్రీ స్క్రబ్బర్‌ని ఉపయోగిస్తారు.

ఇంట్లోని పదార్ధాలతో చేసుకునే స్క్రబ్


ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన పరిష్కారం ఉప్పుతో చేసిన స్క్రబ్. ఇందుకు కావలసిందల్లా సాధారణ ఉప్పు లేదా సముద్రపు ఉప్పు. ఈ ఉప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దీనికి కొద్దిగా ఆలివ్ నూనె కలిపి స్క్రబ్ లాగా ఉపయోగించాలి. శరీరంపై గాయాలు ఉన్న చోట ఈ స్క్రబ్బర్ తగలకుండా చూసుకోవాలి.

బరువు తగ్గించే ప్రక్రియ



బరువు తగ్గడం కోసం ప్రత్యేకించి స్పా సెలూన్‌లో చేసే విధానం చాలా ఖరీదైనది. తేనె శరీరం యొక్క జీవక్రియను వేగవంతం చేస్తుంది. టాక్సిన్స్‌ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇందుకోసం శరీరంలో ఎక్కడైతే కొవ్వు అధికంగా ఉందని భావిస్తారో ఆ ప్రాంతంలో తేనె పూయాలి. ఆ భాగానికి ఇన్సులేటింగ్ ర్యాప్ చేయాలి. దానిపైన 30 నిమిషాలపాటు వెచ్చని దుప్పటి కప్పి ఉంచాలి. వేడి పెరిగే వరకు వేచి ఉంటే ఫలితం ఉంటుంది.

గోళ్ల సంరక్షణ


గోళ్లు చూసి ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పేస్తారు డాక్టర్లు. ఆరోగ్యవంతుల గోర్లు అందంగా ఉంటాయి. నెయిల్ సెలూన్‌లకు వెళ్లి ట్రిమ్ చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. ప్రతిరోజూ కొన్ని సాధారణ విధానాల ద్వారా గోర్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ వంటి ముఖ్యమైన నూనెలతో గోర్లకు మసాజ్ చేయడం ఒక చక్కటి పరిష్కారం. ఇది గోళ్లను ధృఢంగాచేస్తుంది. గోరు చుట్టూ ఉన్న చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. మరో సులభమైన చిట్కా ఏమిటంటే గోళ్లను నిమ్మకాయ ముక్కతో కొన్ని నిమిషాలు రుద్దడం వల్ల గోళ్లు తెల్లగా మార్చడంతో పాటు వాటికి మంచి మెరుపు వస్తుంది.

Tags

Next Story