Omicron Variant: కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'ని ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా

Omicron Variant: రోజుకో కొత్త వైరస్.. ప్రజల ప్రాణాలు హరించడానికి కాపు కాసుకొని కూర్చుంటున్నాయి. రోగ నిరోధక శక్తి ఒక్కటే వైరస్ నుంచి మనల్ని రక్షిస్తుంది. రుచిగా ఉందని ఏది పడితే అది తినకుండా కాస్త నోటిని కట్టడి చేసుకుని మంచి ఆహార పదార్ధాలు, పండ్లు తీసుకోవడం ఉత్తమం. సీజనల్ వ్యాధుల నుంచి, విచిత్రమైన వైరస్‌లనుంచి మీ శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ మిమ్మల్ని రక్షిస్తుంది.
మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను దేనితోనైనా పోరాడటానికి మీరు మీ జీవనశైలిని మార్చుకోవాలి. సరైన ఆహారాన్ని చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలి. COVID ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా అనుసరించడంతో పాటు, రోగనిరోధక వ్యవస్థను పెంపొందించే కొన్ని మార్గాలు క్రింద ఉన్నాయి. వాటిని మీ జీవనశైలిలో ఒక భాగంగా చేసుకోవాలి.
శరీరం రోజంతా చురుకుగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. హెవీ వర్కవుట్స్ కాకుండా మితంగా చేయాలి. వీలైనంత వరకు నడక, యోగా వంటివి ఉత్తమం. అనేక అధ్యయనాలు నిద్ర కూడా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నాయి. ఒకవేళ మీరు నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే వైద్యుని సంప్రదించడం అవసరం. పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు, వంటి ఆహారాలు శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థకు సహాయపతాయి. ఈ ఆహారాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వైరస్‌లతో పోరాడుతాయి.
శరీర భాగాలు సరిగ్గా పనిచేయాలంటే తగినంత నీరు అవసరం. చలి కాలంలో మనలో చాలా మంది తక్కువ నీరు త్రాగి తప్పు చేస్తారు. దాంతో శరీరం డీ హైడ్రేషన్‌కి గురవుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. శరీరంలో తగినంత నీరు ఉంటేనే మీ శరీరం తన పనులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నించండి. శరీరానికి కావలసిన విటమిన్ డి, కాల్షియం, ఐరన్, ఇతర ముఖ్యమైన పోషకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. మీరు మీ రెగ్యులర్ డైట్‌లో రోగనిరోధక శక్తిని పెంచే అశ్వగంధ, గిలోయ్ (తిప్పతీగ రసం) వంటి వాటిని చేర్చుకోవచ్చు. అలాగే రోజుకు ఒకసారి తులసి టీని తీసుకోవడం, గార్‌గ్లింగ్ (గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం) చేయండం ఎంతైనా అవసరం.
Disclaimer: ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా పైనున్న అంశాలను మీకు అందివ్వడం జరిగింది. ఇది వైద్యుల చికిత్సకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోగలరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com