Banana Leaf Food : అరటి ఆకులో భోజనం : చూడడానికే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే.. !

అరటి ఆకులో భోజనం అంటే చూడడానికే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే.. అరటిఆకులో భోజనం చేయడం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. మరి అన్ని ఆకులుండగా అరటి ఆకుని ఎందుకు ఎంచుకున్నారు. అరటిఆకులో భోజనం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
♦ అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినడం వల్ల త్వరగా అది త్వరగా జీర్ణమవుతుంది.
♦ ఒకవేళ అన్నంలో విషం ఉంటే ఆ ఆకు నలుపు రంగులోకి మారిపోతుంది. అరటిఆకులో అన్నం పెడితే శత్రువులు కూడా ఎలాంటి భయం లేకుండా తింటారు.
♦ అరటి ఆకులపై వడ్డించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
♦ ఎన్నో రకలైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం.
♦ భోజనం చేసిన తర్వాత ఈ ఆకులను బయట పడేసినా తొందరగా మట్టిలో కలిసిపోతాయి. తద్వారా పర్యావరణానికి మేలు చేసినట్టు కూడా అవుతుంది.
♦ వేడివేడిగా ఉండే భోజనాన్ని అరటి ఆకుపై పెట్టగానే దానిపై ఉండే ఒక పొర కరిగి అన్నంలో కలిసిపోతుంది. ఇది అన్నానికి ఒకరకమైన రుచిని ఇస్తుంది.
♦ అరటిఆకులో భోజనం చేయడం వల్లన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు.
♦ తామరాకులో భోజనం చేసేవారు ఐశ్వర్యవంతులవుతారట. సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
♦ బాదం ఆకులో భోజనంచేసేవారు కఠిన హృదయాత్ములవుతారు.
♦ టేకు ఆకులో భోజనం చేసేవారికి భవిష్యత్తు, వర్తమానాల గురించి తెలుసుకునే జ్ఞానం వస్తుంది.
♦ అయితే ఇవి నిజమో కాదో తెలియదు కానీ అరటి ఆకులో భోజనం చేసిన తృప్తి ప్లాస్టిక్ ప్లేట్ లలో చేస్తే రాదు.
♦ హిందుధర్మశాస్త్రం ప్రకారం మనిషి కూర్చున్న తరువాతే అన్నం వడ్డించాలి. వడ్డించిన విస్తరి ముందు కూర్చోరాదు. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com