curd in winter: అసలే శీతాకాలం.. అన్నంలో పెరుగు తింటే..

curd in winter: అసలే శీతాకాలం.. అన్నంలో పెరుగు తింటే..
curd in winter: విందు భోజనం అంటే.. కూర, పప్పు, పచ్చడి, కమ్మని పెరుగు.. మరి పెరుగన్నం తినకుండా భోజనం పూర్తయినట్లు ఎలా అవుతుంది ముఖ్యంగా మన తెలుగు వారికి. ప్రతి తెలుగు లోగింట్లో పెరుగు ఉండాల్సిందే.

curd in winter: విందు భోజనం అంటే.. కూర, పప్పు, పచ్చడి, కమ్మని పెరుగు ఉండాల్సిందే.. మరి పెరుగన్నం తినకుండా భోజనం పూర్తయినట్లు ఎలా అవుతుంది ముఖ్యంగా మన తెలుగు వారికి. బంధువులు వచ్చారంటే పెరుగు లేకపోతే పక్కింట్లో అయినా అడిగి తెచ్చి వడ్డిస్తారు.


పెరుగు ఒక ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్, ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. పెరుగు లేదా మజ్జిగ భోజనంలో తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అయితే పెరుగు గురించి అనేక అపోహలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాము.


ఉదాహరణకు, చలికాలంలో పెరుగు తినని వారు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ముఖ్యంగా రాత్రి సమయంలో పెరుగు తింటే కఫం పేరుకుంటుందని భావించి పెరుగును దూరం పెడతారు. అయితే శీతాకాలంలో పెరుగు తినడం నిజంగా హానికరమా అంటే..


పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి మంచి బ్యాక్టీరియాను ఇస్తుంది. దీనితో పాటు, పెరుగులో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్-బి2, బి12 ఉంటుంది. ఇవి ప్రతి సీజన్‌లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి.


కాబట్టి శీతాకాలంలో పెరుగుకు సంబంధించిన అపోహల్లోని నిజానిజాలు తెలుసుకుందాం


1. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పెరుగు ఉత్తమమైన ఆహారం. పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అయితే పెరుగును ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే తినకూడదు. తినడానికి కొన్ని గంటల ముందే ఫ్రిజ్ నుంచి బయటకు తీయాలి. మొత్తం చల్లదనం పోయిన తరువాత తినాలి.


2. పెరుగు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తెల్ల రక్త కణాలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి పిల్లలకు తప్పనిసరిగా పెరుగు తినిపించాలి. పెరుగు రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటానికి అందులో పండ్లు, కూరగాయ ముక్కలను కూడా జోడించవచ్చు.


3. రాత్రి భోజనంలో పెరుగు తీసుకుంటే మంచిది. ఇది మీ పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది మెదడులో ట్రిప్టోఫాన్ అనే ప్రత్యేకమైన అమైనో ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి ఆలోచించడానికి సహాయపడుతుంది.


4. తల్లిపాలలో ఇమ్యునోగ్లోబులిన్‌లు పుష్కలంగా ఉన్నందున బిడ్డ ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడకుండా ఉంటుంది. తల్లి పాల ద్వారా పోషకాలు శిశువుకు చేరుతాయి. పాలిచ్చే స్త్రీలు క్యాల్షియం మరియు ప్రొటీన్ల లోపాన్ని తీర్చడానికి ఆహారంలో తాజా పెరుగు లేదా రైతా తీసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story