Depression: డిప్రెషన్ ని గుర్తించడం ఎలా.. సంకేతాలు ఏంటి?
Depression: కొందరితో మాట్లాడుతుంటే మూడ్ ఆఫ్ గా ఉంది.. ఎవరితో మాట్లాడాలనిపించడంలేదు..

Depression: కొందరితో మాట్లాడుతుంటే మూడ్ ఆఫ్ గా ఉంది.. ఎవరితో మాట్లాడాలనిపించడంలేదు.. నన్ను ఒంటరిగా వదిలెయ్, నాతో ఆర్గ్యూ చేయకు, ఇలాంటి పదాలు వాడుతున్నారు.. ఇది డిప్రెషన్ కి సంకేతాలు అని అంటున్నారు మానసిక వైద్యులు.
మొదట్లోనే గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పించడం, మందులు వాడడం ద్వారా వారిని ఆ స్థితినుంచి బయటకు తీసుకురావచ్చని అంటున్నారు. అలానే వదిలేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
అసంతృప్తిగా ఉండటం అనేది కూడా ఒక రకమైన డిప్రెషన్. మనమందరం జీవితంలో కొన్నిసార్లు అనుభవించే విచారం. డిప్రెషన్ అని నిర్ణయించే నిర్దిష్ట లక్షణాలు కొన్ని ఉన్నాయి.
మీరు మానసిక ఆరోగ్య నిపుణులను కలవాల్సిన సమయం ఆసన్నమైందనడానికి కొన్ని హెచ్చరిక సంకేతాలను చూద్దాం..
1. నిస్సహాయత
డిప్రెషన్ అనేది మూడ్ డిజార్డర్. ఇది మీ సాధారణ జీవితంపై ప్రభావం చూపిస్తుంది. మీ జీవితంపై నిస్సహాయ దృక్పథాన్ని కలిగి ఉండటం అనేది అత్యంత సాధారణ లక్షణం. అదంతా నా తప్పే, నేను ఉండి ఏంటి ప్రయోజనం వంటి ఆలోచనలు పదే పదే మీ మెదడును తొలిచేస్తుంటాయి.
2. ఆసక్తి కోల్పోవడం
ఒకప్పుడు మీకు ఎంతో ఇష్టమైన పనులు.. గేమ్స్ ఆడడం, స్నేహితులతో కబుర్లు చెప్పడం, మీ అభిరుచులు.. కానీ ఇప్పుడు వాటి మీద ఆసక్తి లేకుండా ఉంటారు ఇది మరొక సంకేతం. దాంపత్య జీవనం మీద కూడా ఆసక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు ఉంటాయి.
3. అలసట, నిద్రలేమి
మీరు బాగా అలసిపోయినట్లు అనిపించడం వల్ల మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయలేకపోతుంటారు. డిప్రెషన్ కు గురైనప్పుడు తరచుగా శరీరం శక్తి లేనట్లుగా అనిపిస్తుంది. ఎక్కువగ నిద్రపోవాలనిపిస్తుంది. లేదంటే అసలు నిద్ర పట్టదు. నిద్ర లేమి కూడా ఆందోళనకు దారి తీస్తుంది.
4. ఆందోళన
డిప్రెషన్ లో ఆందోళన కలిగించే లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
భయము
గుండె ఎక్కువగా కొట్టుకోవడం,
ఊపిరి ఎక్కువగా తీసుకోవడం
శరీరంలో వణుకు
మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం
5. పురుషులలో చిరాకు
డిప్రెషన్ స్త్రీ, పురుషులపై భిన్నంగా ప్రభావం చూపుతుంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న పురుషులు చిరాకు, కోపం వంటి లక్షణాలను కలిగి ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. డిప్రెషన్‌ను గుర్తించడం లేదా చికిత్స పొందడం వంటివి స్త్రీల కంటే పురుషుల్లోనే తక్కువగా కనిపిస్తుంది.
6. ఆకలి, బరువులో మార్పులు
డిప్రెషన్‌తో బాధపడేవారి అనుభవం ఒక్కో వ్యక్తికి ఒక్కోరకంగా ఉండవచ్చు. కొంతమందికి ఆకలి పెరిగి బరువు పెరుగుతారు, మరికొందరు ఆకలి ఉండదు. దీంతో బరువు తగ్గుతారు.
7. నియంత్రించలేని భావోద్వేగాలు
ఒక్క నిముషం ఆవేశంతో అరుస్తారు. మళ్లీ అంతలోనే ఏడుస్తున్నారు. భావోద్వేగాలు కంట్రోల్ లో ఉండవు. డిప్రెషన్ మానసిక కల్లోలం కలిగిస్తుంది.
8. మరణం వైపు చూడటం
డిప్రెషన్ కొన్నిసార్లు ఆత్మహత్యతో ముడిపడి ఉంటుంది. 2013లో, యునైటెడ్ స్టేట్స్‌లో 42,000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యతో మరణించే వ్యక్తులు సాధారణంగా పై లక్షణాలను కలిగి ఉంటారు.. ఆత్మహత్య ఆలోచనల గురించి తరచుగా ఇతరులతో మాట్లాడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు కుటుంబంలో ఎవరైనా ఉంటే కచ్చితంగా వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి.. ముఖ్యంగా డాక్టర్ ని సంప్రదించాలి.
హాని కలిగించే వస్తువులు ఏవైనా అంటే.. కత్తులు, మందులు లేదా ఇతర వస్తువులు ఉంటే వాటిని తీసివేయండి. వాళ్లు చెప్పేది వినండి, కానీ తీర్పు చెప్పకండి, వాదించకండి, బెదిరించకండి లేదా కేకలు వేయకండి.
RELATED STORIES
World's Most Expensive Car Registration Number: ప్రపంచంలోనే అత్యంత...
30 Jun 2022 7:42 AM GMTGold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు..
30 Jun 2022 6:08 AM GMTGold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, స్వల్పంగా తగ్గిన...
29 Jun 2022 6:49 AM GMTMukesh Ambani: రిలయన్స్ విషయంలో ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం.....
28 Jun 2022 3:00 PM GMTPallonji Mistry: వ్యాపార దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్...
28 Jun 2022 7:07 AM GMTGold and Silver Rates Today : నిన్నటి మాదిరిగానే బంగారం ధర, తగ్గిన...
28 Jun 2022 5:38 AM GMT