AstraZeneca: కోవిడ్‌పై పోరుకు కొత్త ఆయుధం..

AstraZeneca: కోవిడ్‌పై పోరుకు కొత్త ఆయుధం..
X
AstraZeneca: కరోనా మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినా ఆ నీడలు వెంటాడుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరిలో.. మాస్క్‌ని వీడలేకపోతున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినా ఆ నీడలు వెంటాడుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరిలో.. మాస్క్‌ని వీడలేకపోతున్నారు. నలుగురిలో కలవాలంటే కరోనా భయం కనిపిస్తుంది అందరి ముఖాల్లో. అయితే ఈ వ్యాధికి ఇప్పటికే పలు టీకాలు, ఔషధాలు అందుబాటులో ఉండగా.. రీజనరాన్ సంస్థ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కరోనా రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మరో యాంటాబాడీ కాక్‌టెయిల్‌ కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చేసిన ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయి.

ఏమిటీ ఔషధం..

ఏజెడ్‌డీ 7442 (AZD7442) పేరుతో లాంగ్ యాక్టింగ్ యాంటీబాడీలు (LAAB)ల మిశ్రమాన్ని ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. కేవలం ఒక్క డోసుతోనే సానుకూల ఫలితాలను ఇస్తుందని పేర్కొంది.

ప్రయోగ ఫలితాలు..

అయితే ఇవి కోవిడ్ రాకుండా ఎంతవరకు అడ్డుకుంటాయి.. ఈ అంశాలపై మరికొంత పరిశోధన జరగాల్సి ఉంది.

కొంత మంది వలంటీర్లకు 300 ఎంజీ డోస్‌ను ఇచ్చారు. అమెరికా, యూకే, స్పెయిన్, బెల్జియంలోని 87 ప్రదేశాల్లో 5,197 మందిపై ఈ ప్రయోగాలు చేశారు. డోసు తీసుకున్న వారిలో దాదాపు 83 శాతం మందికి కోవిడ్ సోకే ముప్పు తగ్గింది.

ఏజెడ్‌డీ 7442 వల్ల దుష్పభావాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని ఆస్ట్రాజెనెకా పేర్కొంది.

ఈ కొత్త ఔషధం బ్లడ్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్లకు చికిత్స పొందుతున్న వారికి, డయాలసిస్ చేయించుకునే వారికి, అవయవ మార్పిడి జరిగిన వారికి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story