Toilet Health Problems: టాయిలెట్‌లో ఎక్కువసేపు గడిపితే ఆ సమస్య తప్పదు..

Toilet Health Problems: ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన వింత అలవాటు ఉంటుంది. అలాంటి వింత అలవాట్లలో ఒకటే టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చొవడం. ఈ అలవాటు ఈరోజుల్లో చాలామందికే ఉంది. ఈరోజుల్లో ఫోన్ పట్టుకుని టాయిలెట్‌లోకి వెళ్లాలంటే మళ్లీ వారు ఎప్పటికో బయటికి వస్తున్నారు. ఫోన్‌తోనే టాయిలెట్‌లో కాలక్షేపం చేస్తూ.. అక్కడే ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. అయితే అలా గడపడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు.
టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్ సమస్య వస్తుందట. అది ఎలా అంటే టాయిలెట్‌లో 10 నిముషాల కంటే ఎక్కువ కూర్చుంటే మల మార్గంలో ఉండే రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువయ్యి, రక్తనాళాలు ఉబ్బుతాయి. దీని వల్ల పైల్స్ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దీనిని హెమోరాయిడ్ అని అంటారు. ఇది విన్న వారంతా పైల్స్ లాంటి ఆరోగ్య సమస్య బారినపడడం కంటే టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోకపోవడమే మేలు అనుకుంటున్నారు.
జీర్ణ ప్రక్రియ సజావుగా జరగడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ప్రతి రోజూ తీసుకుంటే మల విసర్జన సక్రమంగా ఉంటుంది కాబట్టి టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవాల్సిన అవసరం ఉండదని వైద్యులు అంటున్నారు. ఇండియన్ స్టైల్ టాయిలెట్‌లో హెమోరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని, వెస్టర్న్ టాయిలెట్ వల్లే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com