Sleep Apnea : గుండెకు ప్రమాదం గురక.. బప్పీలహరికి..

Sleep Apnea : గుండెకు ప్రమాదం గురక.. బప్పీలహరికి..
Sleep Apnea : స్లీప్ అప్నియా (గురక) అనేది ఒక స్లీప్ డిజార్డర్. ఒక వ్యక్తి నిద్రలో శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోతుంది.

Sleep Apnea : స్లీప్ అప్నియా (గురక) అనేది ఒక స్లీప్ డిజార్డర్. ఒక వ్యక్తి నిద్రలో శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోతుంది. ఇరుకైన వాయుమార్గం గాలిని ఊపిరితిత్తులకు చేరకుండా నియంత్రిస్తుంది. గాలి తీసుకోవడం కోసం ఆ వ్యక్తి బిగ్గరగా ఊపిరి పీల్చుకుంటాడు.. దాన్నే గురక అంటారు. అయితే గురక పెట్టే వారికి వాళ్లు గురక పెడుతున్న విషయం తెలియదు.. పక్కన పడుకున్న వారికి మాత్రం చాలా ఇబ్బంది.

స్లీప్ అప్నియా ప్రభావం చేసే పని మీద పడుతుంది. ఏకాగ్రత తెబ్బతింటుంది. శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు సంభవిస్తాయి.

స్లీప్ అప్నియా vs హార్ట్ డిసీజ్

యునైటెడ్ స్టేట్స్‌లో మరణాలు సంభవించడానికి ప్రధాన కారణం గుండె జబ్బులు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అతిగా మద్యం సేవించడం, ధూమపానం చేయడం వంటివి ఉన్నాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ఆరోగ్య పరిస్థితుల్లో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండడం, మధుమేహం, ఊబకాయం ఉన్నాయి. గురక గుండె సంబంధత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 140% మరియు కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని 30% పెంచుతుంది.

గురకకు ముఖ్య కారణం ఊబకాయం

గురక, గుండె జబ్బులు.. రెండింటినీ అభివృద్ధి చేయడంలో ఊబకాయం ముఖ్య పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. స్లీప్ అప్నియా ఉన్నవారిలో 60 నుండి 90% మంది ఊబకాయంతో బాధపడుతుంటారు.

నిద్ర లేమి కారణంగా గుండె జబ్బులు

గురక పెట్టే వ్యక్తులకు సరిపడినంత నిద్ర ఉండదు. ఇది కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శరీరం విశ్రాంతి కోరుకున్న సమయంలో నిద్ర పడుతుంది. నిద్రలో హృదయ స్పందన రేటు, రక్తపోటు తగ్గుతుంది.

OSA పరిస్థితుల కారణంగా దీర్ఘకాలిక నిద్ర లేమితో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

వైద్యుడిని ఎప్పుడు చూడాలి

గురక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

స్లీప్ అప్నియా లక్షణాలు:

నిద్రలో గురక లేదా బిగ్గరగా ఊపిరి పీల్చుకోవడం

నిద్రలో శ్వాస తీసుకోవడంలో విరామం

పగటిపూట నిద్రపోవడం

ఏకాగ్రతను కాపాడుకోవడంలో ఇబ్బంది

మేల్కొన్నప్పుడు నోరు పొడిబారడం లేదా తలనొప్పి

లైంగిక శక్తి సన్నగిల్లడం

మూత్ర విసర్జన చేయడానికి రాత్రిపూట తరచుగా మేల్కోవడం

గురకతో బాధపడుతున్న వ్యక్తులు చెవి, ముక్కు, గొంతు (ఇఎన్‌టీ) డాక్టర్‌ని సంప్రదించడం అవసరం. జీవనశైలి మార్పులు: పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. బరువు తగ్గడం, వ్యాయామం చేయడం, మద్యపానాన్ని పరిమితం చేయడం, ధూమపానం మానేయడం, నిద్ర స్థితిని మార్చడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయి.

పరికరాలు: PAP పరికరాలు వాయుమార్గం ద్వారా గాలిని పంపుతాయి.

నోరు, గొంతుకు సంబధించిన వ్యాయామాలు: ఒక వ్యక్తి యొక్క స్లీప్ అప్నియా యొక్క కారణాన్ని బట్టి, నోరు, గొంతుకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు ఈ కండరాలను టోన్ చేయడంలో సహాయపడతాయి, ఇవి నిద్రలో శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగించే అవకాశం తక్కువ.

సర్జరీ: స్లీప్ అప్నియా కోసం చేసే శస్త్రచికిత్సలో వాయుమార్గ సంకోచానికి కారణమయ్యే శరీర భాగాలను మార్చడం లేదా వాయుమార్గం చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోయేలా చేసే పరికరాలను అమర్చడం వంటివి ఉండవచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి.

Tags

Next Story