నిద్రించే విధానం.. ముఖంపై ముడతలు ఏర్పడడానికి కారణం..

నిద్రించే విధానం.. ముఖంపై ముడతలు ఏర్పడడానికి కారణం..
బెడ్ ఎక్కగానే అటొక కాలు, ఇటొక కాలు వేసి అడ్డదిడ్డంగా పడుకుంటున్నారా.. కానీ ఈ రోజు నుంచి అలా చేయకండేం..

బెడ్ ఎక్కగానే అటొక కాలు, ఇటొక కాలు వేసి అడ్డదిడ్డంగా పడుకుంటున్నారా.. కానీ ఈ రోజు నుంచి అలా చేయకండేం.. ఎందుకంటే మీ ముఖం మీరు నిద్రించే పొజిషిన్ ని బట్టి మారుతుందట.. ఎవరికైనా ఎందుకుండదు అందంగా ఉండాలని. అందుకే నిద్రపోవడానికి బెడ్ ఎక్కేముందు మీ పొజిషన్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. డీప్ స్లీప్ లోకి వెళ్లిన తరువాత ఎలా ఉంటారో మీకే తెలియదు.. కనీసం పడుకునే ముందైనా సరిగ్గా పడుకుంటే ఆ ప్రభావం ముఖంపై, పెదవులపై పడకుండా ఉండదని అంటున్నారు బ్యుటీషియన్లు. ఒక మంచి దిండు కూడా చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఇంతకీ స్లీపింగ్ పొజిషన్‌ను ఎలా ఉంటే మీ ముఖం చంద్రబింబంలా అందగా మారుతుందో తెలుసుకుందాం.

ఆరోగ్యానికి మంచి ఆహారమే కాదు తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యం అని మనందరికీ తెలుసు. అయినా బెడ్ ఎక్కేవరకు ఫోన్ మాట్లాడుతూనో, టీవీ చూస్తూనో గడిపితే శరీరం మెరుపుని కోల్పోతుంది. కళ్ల కింద నల్లని వలయాలు, అలసిన ముఖంతో అందవికారంగా మారుతారు. అందుకే తగినంత నిద్ర చాలా అవసరం అని వివరిస్తారు వైద్యులు.

మీ నిద్ర అలవాట్లు మీ రూపాన్ని కూడా ప్రభావితం చేయగలవని మీరు గ్రహించాలి. నిర్దిష్ట భంగిమల్లో నిద్రించడం వల్ల మీ ముఖంపై ఒత్తిడి మరియు రాపిడి ఏర్పడుతుంది. ముఖంపై ముడతలు ఏర్పడి అవి కాలక్రమేణా శాశ్వతంగా మారవచ్చు. మీ పెదవులు, కళ్ళు ఇతర ముఖ లక్షణాలతో పాటు, పొట్టపై పడుకోవడం వలన చర్మంలో నిలువు మడతలు కనిపిస్తాయి.

ఈస్తటిక్ సర్జరీ జర్నల్ పరిశోధన ప్రకారం.. వయస్సు పెరిగే కొద్దీ శాశ్వతంగా మారుతుంది. తిరిగి మామూలు స్థితికి చేరుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది.

స్లీపింగ్ పొజిషన్‌లు ముడుతలకు ఎలా కారణమవుతాయి?

ముడతలు వృద్ధాప్య సంకేతం అయినప్పటికీ, జన్యుశాస్త్రం, జీవనశైలి, సూర్యరశ్మి సహా వాటిని ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. మీరు నిద్రించే విధానం, ప్రత్యేకించి మీరు నిద్రిస్తున్నప్పుడు పదేపదే కదలికల కారణంగా నిర్దిష్ట భంగిమల్లో నిద్రించడం వల్ల ముఖం, మెడ చుట్టూ ముడతలు ఏర్పడతాయి.

వెల్లకిలా పడుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి. ఇది నిద్ర నుండి ముడతలు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఈ స్థానం మీ ముఖం యొక్క నిర్దిష్ట భాగాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

సిల్క్ లేదా శాటిన్ పిల్లోస్ మీ ముఖంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. మీ తలకు, మెడకు సపోర్ట్ ని ఇచ్చే దిండుని ఉపయోగించండి. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన దిండును ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలను ఉపయోగించడం ద్వారా మీరు మంచి నిద్రను పొందవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story