Sleeping With Jeans: రోజంతా జీన్స్‌లోనే.. నిద్ర కూడా దాంతోనే అంటే.. కోరి కష్టాలు..

Sleeping With Jeans: రోజంతా జీన్స్‌లోనే.. నిద్ర కూడా దాంతోనే అంటే.. కోరి కష్టాలు..
Sleeping With Jeans: బట్టలు మార్చుకోవాలంటే బద్ధకం.. కాలేజీ నుంచి లేదా ఆఫీస్ నుంచి రాగానే సోఫాలో సెటిల్ అవుతుంటారు.. ఎన్ని సార్లు చెప్పినా వినకపోగా అబ్బ.. ఏమవుతుందిలే అని అమ్మ మాటను కొట్టిపారేస్తుంటారు..

Sleeping with Jeans: బట్టలు మార్చుకోవాలంటే బద్ధకం.. కాలేజీ నుంచి లేదా ఆఫీస్ నుంచి రాగానే సోఫాలో సెటిల్ అవుతుంటారు చాలా మంది. ఎన్ని సార్లు చెప్పినా వినకపోగా అబ్బ.. ఏమవుతుందిలే అని అమ్మ మాటను కొట్టిపారేస్తుంటారు.. అలానే జీన్స్‌తో బెడ్ కూడా ఎక్కేసే మహానుభావులు కూడా ఉంటారు.

అయితే అలా నిద్రించడం అనారోగ్యాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా నైట్ నిద్రించే ముందు వదులుగా ఉన్న దుస్తులు ధరిస్తే నిద్ర బాగా పడుతుంది.. ఆరోగ్యానికీ మంచిదని చెబుతున్నారు. జీన్స్ వేసుకుని నిద్రిస్తే కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్లే అని అంటున్నారు.

జీన్స్ డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో తయారవుతుంది.. గాలి చొరబడనంత దట్టంగా ఉంటుంది దీనికి ఉపయోగించే క్లాత్.. చెమట పీల్చుకునే స్వభావం కూడా ఉండదు.. ఫలితంగా జననేంద్రియాల వద్ద పట్టిన చెమట అలాగే ఉండిపోతుంది. దీంతో ఆ ఏరియాలో బ్యాక్టీరియా, ఫంగస్, వంటివి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

ఇది క్రమంగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయం జీన్స్ ధరించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కాలంతో సంబంధం లేకుండా చెమట ఎక్కువగా పట్టే శరీరతత్వం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం.

సాధారణంగా బిగుతైన దుస్తులు ధరించి పడుకుంటే నిద్ర సరిగా పట్టదు.. ఇక జీన్స్ వంటివి ధరిస్తే మరింత కష్టం. గాలి సరిగా జరగక శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుందని అధ్యయనంలో తేలింది.

జీన్స్ వంటి బిగుతైన దుస్తులు ధరించి నిద్రించడం వల్ల గర్భాశయం, పొత్తి కడుపు, జననేంద్రియాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. అలాగే ఆయా భాగాలకు రక్తప్రసరణ కూడా సరిగా జరగదు. దీని కారణంగా నెలసరి సమయంలో నొప్పి తీవ్రమవుతుంది. మరోవైపు ఇలాంటి బిగుతైన దుస్తులు ధరించడం వల్ల నడుంనొప్పి, కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.

బిగుతైన దుస్తులు శరీరంలో రక్త ప్రసరణకు కూడా ఆటంకం కలిగిస్తాయి.. నరాలపైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నీరసం, మైకం కమ్మడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

కాబట్టి నిద్రించే సమయంలో సాధ్యమైనంత వరకు వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Tags

Read MoreRead Less
Next Story