Smriti Irani Weight Loss: ఏం మాయ చేశారో.. 50 ఏళ్ల వయసులో అంత బరువు తగ్గారు!

Smriti Irani Weight Loss: ఏం మాయ చేశారో.. 50 ఏళ్ల వయసులో   అంత బరువు తగ్గారు!
Smriti Irani Weight Loss: కొందరు మాత్రం పట్టువదలకుండా ఎంతో కష్టపడి నాజుగ్గా తయారవుతారు.

Smriti Irani Weight Loss: హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ.. కెరీర్‌లో యాక్టివ్‌గా ఉన్నంతవరకు.. తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి ఎన్నో వ్యాయామాలు చేస్తుంటారు, జిమ్‌కు వెళ్తుంటారు, చాలా కఠానమైన ఫుడ్ డైట్‌ను కూడా ఫాలో అవుతుంటారు. కాస్త అవకాశాలు తగ్గి ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయిన తర్వాత ఇంక వాటిపై దృష్టిపెట్టరు. కానీ కొందరు మాత్రం పట్టువదలకుండా ఎంతో కష్టపడి నాజుగ్గా తయారవుతారు. తాజాగా ఆ జాబితాలోకి చేరారు ఖుష్భూ, స్మృతి ఇరానీ.

ఖుష్భూ ఒకప్పుడు తన అందంతో, అభినయంతో మిగతా హీరోయిన్లకు గట్టి పోటీనే ఇచ్చింది. సినీ పరిశ్రమలో ఉన్నంతవరకు తాను చాలా నాజుగ్గా, అందంగా కనిపించేది. ఆ తర్వాత మెల్లమెల్లగా తాను బరువు పెరగడం మొదలయ్యింది. దీంతో తనకు హీరోయిన్ పాత్రలు రావడం దూరమయ్యింది. చాలాకాలం బొద్దుగా ఉన్న ఖుష్భూను చూడడం మనకు కూడా అలవాటయిపోయింది. కానీ తాజాగా తాను మళ్లీ బరువు తగ్గానంటూ ట్విటర్‌లో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఉన్నపళంగా ఇంత సన్నగా అయిపోవడానికి సీక్రెట్ ఏంటి అని తన అభిమానులు ఎంతోమంది అడిగారు. దీనికి 'ఫిట్‌నెస్ గోల్స్ ఎట్ 50' అని పేరు పెట్టుకున్నానంటూ సమాధానమిచ్చింది ఖుష్భూ. లాక్‌డౌన్ సమయంలోనే తాను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారట. అందుకే జిమ్, వర్కవుట్స్, యోగా లాంటివి ప్రతీ ఒక్కటి చేశారట. ఇంటి పని కూడా అన్నీ తానే స్వయంగా చేసుకున్నారట. పోషకవిలువలు తగ్గకుండా, శరీరంలో నీటి శాతం పడిపోకుండా జాగ్రత్తపడ్డారట. అందుకే ఆమె తొమ్మిది వారాల్లో 15 కేజీల బరువు తగ్గారు.


గ్లామర్ ఇండస్ట్రీలో కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు స్మృతి ఇరానీ. చాలాకాలం ఆమెను అధిక బరువుతోనే అందరూ చూశారు. స్మృతి అంటే ఇలాగే ఉంటుందని ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ ఇటీవల ఆమె చాలా బరువు తగ్గింది. అసలు ఇది ఎలా సాధ్యమయింది అని ఆమెను చాలామంది అడగగా.. వ్యాయామం, ఆహారంలో మార్పులు, యోగా.. ఇవే తాను బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. గింజ ధాన్యాలు, గ్లుటెన్‌, చక్కెర రహిత పదార్థాలు, పాల ఉత్పత్తులు తరచుగా తీసుకున్నారట.


వర్కవుట్స్, ఆహారపు అలవాట్లు.. ఇవి ఈ ఇద్దరినీ నాజుగ్గా మార్చేశాయి. ఎంతోకాలంగా అధిక బరువుతో కనిపించిన వీరిద్దరు ఇప్పుడిలా నాజుగ్గా అయిపోయారు. అంతే కాక ఇలాంటి చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా.

Tags

Read MoreRead Less
Next Story