Hair Loss: జుట్టు రాలడానికి కారణమయ్యే ఆహారాలు.. వీటికి దూరంగా ఉంటే..

Hair Loss: జుట్టు రాలడానికి కారణమయ్యే ఆహారాలు.. వీటికి దూరంగా ఉంటే..
Hair Loss: ఒత్తిడి, కాలుష్యం కూడా జుట్టుపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ, కొన్ని ఆహారాలు కూడా జుట్టు రాలడానికి దోహదపడతాయి.

ఆరోగ్యకరమైన, దృఢమైన మెరిసే జుట్టు పురుషులు మరియు స్త్రీలకు ఇద్దరికీ అవసరం. అందమైన జుట్టు కోసం ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించడం సర్వసాధారణం. చర్మం వలె, ఆరోగ్యకరమైన జుట్టుకి కూడా మంచి పోషకాలు అందాలి.. మీరు తీసుకునే ఆహారం మీ జుట్టుకు హాని కలిగించవచ్చు. ఒత్తిడి, కాలుష్యం కూడా జుట్టుపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ, కొన్ని ఆహారాలు కూడా జుట్టు రాలడానికి దోహదపడతాయి. వాటి నుంచి దూరంగా ఉంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది.. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

సాధారణంగా జుట్టు సమస్యలకు ఒత్తిడి మరియు జన్యుశాస్త్రం కారణమని చెబుతారు. అయితే కొన్ని ఆహారపదార్థాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడకపోగా వెంట్రుకలు రాలిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి.ఆరోగ్యకరమైన జుట్టు కోసం తప్పనిసరిగా నివారించాల్సిన ఆహారాలను చూద్దాం.

జుట్టు పెరుగుదల కోసం మీరు తప్పక నివారించాల్సిన ఆహారాలు..

1. చక్కెర



చక్కెర జుట్టుకు ఎంత చెడ్డదో మొత్తం ఆరోగ్యానికి కూడా అంతే చెడ్డది. మధుమేహం మరియు స్థూలకాయానికి దారితీసే ఇన్సులిన్ నిరోధకత జుట్టును కోల్పోయేలా చేస్తుంది. బట్టతల రావడానికి కూడా చక్కెర ఓ ప్రధాన కారణంగా చెబుతారు పోషకాహార నిపుణులు.

2. మద్యం


జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. ఆల్కహాల్ ఈ ప్రోటీన్ సంశ్లేషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దాంతో జుట్టు బలహీనంగా మారుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే మంచిది.

3. జంక్ ఫుడ్


జంక్ ఫుడ్స్ మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. ఇది ఊబకాయంతో పాటు గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. జుట్టును కోల్పోయేలా చేస్తుంది. SFA మరియు MUFAలు అధికంగా ఉన్న ఆహారం టెస్టోస్టెరాన్ స్థాయిలను సైతం పెంచుతుంది. అలాగే, ఆయిల్ ఫుడ్స్ మీ స్కాల్ప్‌ను జిడ్డుగా మార్చుతాయి. ఇది తలపై ఉన్న రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది.

4. చేప


పాదరసం ఎక్కువగా ఉన్న చేపలు తినడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. సముద్రపు నీటి చేపలు స్వోర్డ్ ఫిష్, మాకేరెల్, షార్క్ మరియు కొన్ని రకాల ట్యూనా చేపలలో పాదరసం ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉంటే మంచిది. కొన్ని రకాల చేపలు జుట్టుకు మంచి చేస్తే మరికొన్ని చెడు చేస్తాయి.

జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే వైద్యుడిని సంప్రదించాలి. పై సమాచారం హెల్త్ ‌వైబ్‌సైట్స్‌లో నిపుణులు సూచించిన అభిప్రాయాలు.. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ, డాక్టర్ సూచించిన మేరకు నడుచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story