Health News: ముఫ్పైల్లోనే ముడతలా.. ఫోన్లో ఎక్కువసేపు ఉంటే అంతేనట..

Health News: ముఫ్పైల్లోనే ముడతలా.. ఫోన్లో ఎక్కువసేపు ఉంటే అంతేనట..
Health News: చాలా కాలం తర్వాత ఈ మధ్య మిమ్మల్ని కలిసిన వారు ఎంటి అలా అయిపోయావని అంటున్నారా.. అయితే కచ్చితంగా మీరు ఫోన్‌కి దూరంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నమాట.

Health News: చాలా కాలం తర్వాత ఈ మధ్య మిమ్మల్ని కలిసిన వారు ఎంటి అలా అయిపోయావని అంటున్నారా.. అయితే కచ్చితంగా మీరు ఫోన్‌కి దూరంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నమాట. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడుతూనో, చాట్ చేస్తూనో ఫోన్‌తోనే గడిపితే చర్మం త్వరగా ముడుతలు పడే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు.

ఫోన్, ల్యాప్‌టాప్‌‌లలో ఎక్కువ సమయం గడపడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుందని అధ్యయనం చెబుతోంది. బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఫ్లై హెడ్స్ కణాలలో గణనీయమైన వ్యత్యాసాలను గుర్తించారు. ముఖ్యంగా, మెటాబోలైట్ సక్సినేట్ స్థాయిలు పెరిగినట్లు వారు కనుగొన్నారు. కానీ గ్లూటామేట్ స్థాయిలు తగ్గాయి.

గాడ్జెట్‌లపై ఎక్కువ సమయం గడపడం వల్ల మీ కంటి చూపు లేదా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గతంలోని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, ఇది మీ వృద్ధాప్య ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. 'ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్' జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా గాడ్జెట్ల నుండి వచ్చే అధిక నీలి కాంతి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని సూచించింది.

"టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరియు ఫోన్‌ల వంటి రోజువారీ పరికరాలు బ్లూ లైట్‌ను అధికంగా బహిర్గతం చేస్తాయి. ఇది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. మెదడు పని తీరుని కూడా క్షీణింపజేస్తుంది. నవంబర్ 2021లో నిర్వహించిన ఈ సర్వేలో.. కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు గ్యాడ్జెట్లకు ఎక్కువగా అలవాటు పడ్డారని తెలిపారు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఎక్కువ సమయం ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే ఉన్నారని వాపోయారు. ఇది పిల్లల శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని సర్వేలో పాల్గొన్న 95 శాతం మంది తల్లిదండ్రులు విశ్వసించారు.

దాదాపు 62 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతిరోజూ నాలుగు-ఆరు గంటలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల కోసం వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. 23 శాతం మంది తల్లిదండ్రులు వారాంతాల్లో అయితే ఆరు గంటలకు పైగా తమ పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారని చెప్పారు. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం అనేది మంచి యాంటీ ఏజింగ్ స్ట్రాటజీగా కూడా పని చేస్తుంది.

Tags

Next Story