Gas Trouble: మసాజ్‌తో గ్యాస్‌ట్రబుల్ మాయం.. ప్రతి రోజూ ఇలా చేస్తే..

Gas Trouble: సమయానికి ఆహారం తినకపోతే కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి.. మసాల వంటలు తిన్నా కూడా గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతుంది. కడుపులో గ్యాస్ ఉంటే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ఏం తినాలనిపించదు. ఇది జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
గ్యాస్ సమస్య నుంచి కొంత ఉపశమనం కలిగించేది మసాజ్. రెండు చేతులతో పొత్తికడుపు ప్రాంతాన్ని మసాజ్ చేయడం.
పొత్తికడుపు మసాజ్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
-యోగా మ్యాట్ వేసుకుని నేలపై పడుకోవాలి.
-కాళ్లు మడిచి ఉంచాలి. పాదాలు ఫ్లాట్ పొజిషన్‌లో ఉండేలా చూసుకోవాలి.
-ఇప్పుడు, మీ రెండు చేతులను మీ పొట్టపై ఉంచి, వృత్తాకారంలో మసాజ్ చేయడం ప్రారంభించండి. ఒకసారి సవ్య దిశలో మరొక సారి అపసవ్యదిశలో చేయాలి.
-మసాజ్ చేస్తున్నంత సేపు శ్వాస మీద కూడా దృష్టి పెట్టి చేయాలి.
-నొప్పిగా ఉన్న ప్రాంతంలో కొంచెం ఒత్తిడి ఉపయోగించి చేయవచ్చు. పొత్తికడుపు రిలాక్స్ అయ్యే వరకు మసాజ్ చేస్తూ ఉండండి.
-గ్యాస్ సమస్య నివారణకు ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి. 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం అవసరం. ఇది ఉబ్బరం మరియు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరంగా ఉంచుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com