Sudden cardiac arrest: సడెన్ గా గుండె ఎందుకు ఆగిపోతుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..

Sudden cardiac arrest: సడెన్ గా గుండె ఎందుకు ఆగిపోతుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Sudden cardiac arrest: మనమధ్యే ఉన్నాడునుకున్న మనిషి కాస్తా మరణిస్తాడు.. దీనినే ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అంటారు..

Sudden cardiac arrest: అప్పటి వరకు బాగానే ఉంటారు.. తమంత ఆరోగ్య వంతులే లేరనుకుంటారు.. ఆహార నియమాలు పాటిస్తారు.. వర్కవుట్లెన్నో చేస్తుంటారు.. అయినా అలసట ఏ మాత్రం లేకుండా, నిరంతరాయంగా పని చేసే గుండె ఒక్కసారిగా పని చేయడం మానేస్తుంది. గుండె ఆగిపోతుంది.. మనమధ్యే ఉన్నాడునుకున్న మనిషి కాస్తా మరణిస్తాడు.. అసలు ఎందుకు ఇంత సడెన్ గా ఇలా జరుగుతుంది..

దీనినే ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అంటారు.. ఈ పరిస్థితి సాధారణంగా గుండె యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్‌తో ముడిపడి ఉంటుంది. ఇది గుండె యొక్క పంపింగ్ చర్యకు అంతరాయం కలిగిస్తుంది. శరీరానికి రక్త ప్రవాహాన్ని ఆపివేస్తుంది.

ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటుతో సమానం కాదు. గుండెలోని ఒక భాగానికి రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ఇలా జరుగుతుంది.

వెంటనే చికిత్స చేయకపోతే, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ మరణానికి దారి తీస్తుంది. సకాలంలో వైద్యం అందితే మనిషి మరణం అంచులు చేరుకున్నా బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యుని చేరుకునే లోపు బాధితుడికి ఛాతిపై ఒత్తిడి తీసుకురావాలి.

లక్షణాలు

ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి.

ఊపిరి అందదు, స్పృహ కోల్పోతారు, ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవుట, శరీరం నిస్సత్తువగా బలహీనంగా మారుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, గుండె దడగా అనిపిస్తుంది. అయితే ఒక్కోసారి ఎలాంటి సూచనలు లేకుండానే ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది.

వైద్యుడిని ఎప్పుడు చూడాలి

ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం

గుండె దడ

గుండె వేగంగా కొట్టుకోవడం,

గురక

శ్వాస ఆడకపోవుట

తలతిరగడం వంటి లక్షలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ప్రమాద కారకాలు

ధూమపానం

అధిక రక్త పోటు

అధిక రక్త కొలెస్ట్రాల్

ఊబకాయం

మధుమేహం

జీవనశైలి.. ఇవన్నీ గుండెపై ప్రభావం చూపిస్తాయి.

ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించినప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ తగ్గడం వలన అపస్మారక స్థితికి కారణమవుతుంది. గుండె వేగం సాధారణ స్థితికి రాకపోతే, మెదడు దెబ్బతింటుంది, మరణం సంభవిస్తుంది.

నివారణ

రెగ్యులర్ చెకప్‌లను చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని కొంత వరకు తగ్గించవచ్చు.

గమనిక: ఇది అవగాహనకోసం మాత్రమే.. మీ ఫ్యామిలీ డాక్టర్ సూచించిన మేరకు నడుచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story