చినుకులు పడుతున్న వేళ చెరుకురసం తాగితే..

చినుకులు పడుతున్న వేళ చెరుకురసం తాగితే..
వాన చినుకులు పడుతున్న వేళ వేడి వేడిగా ఏ బజ్జీలో, పకోడీనో లేదా అప్పుడే కాలుస్తున్న మొక్క జొన్న కండో తినాలనిపిస్తుంది కదా. ఓకే..

వాన చినుకులు పడుతున్న వేళ వేడి వేడిగా ఏ బజ్జీలో, పకోడీనో లేదా అప్పుడే కాలుస్తున్న మొక్క జొన్న కండో తినాలనిపిస్తుంది కదా. ఓకే.. వాటితో పాటు వారానికోసారి చెరకు రసం కూడా తాగేయమంటున్నారు న్యూట్రీషియన్లు. చెరకు రసంలో విటమిన్-బి, విటమిన్-సిలు పుష్కలంగా ఉంటాయి.

కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా వర్షాకాలంలో దరిచేరే వ్యాధులు జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటి నుంచి బయటపడాలంటే తాజా పండ్లు, పండ్ల రసాలతో పాటు ఇక నుంచి చెరకు రసాన్ని కూడా మీ లిస్ట్‌లో చేర్చుకోండి.

వేసవి కాలంలో అయితే ఎక్కడ చూసినా చెరకు రసం బండ్లు దర్శనమిస్తుంటాయి. అందులో కాస్త ఐసే వేసి ఇవ్వడంతో కూల్‌గా తాగేస్తాము. దాంతో పోయిన ప్రాణం లేచి వచ్చినంత హాయిగా ఉంటుంది. మరి వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కదా.

ఈ సమయంలో చెరకు రసం తాగితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందేమో అన్న అనుమానాలు తలెత్తుతాయి. కానీ చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

దీంతో వర్షాకాంలో వచ్చే వివిధ రకాల అంటువ్యాధులను అరికట్టడంలో చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. అధిక శరీర బరువుతో బాధపడేవారు కూడా చెరకు రసం తాగడం ద్వారా శరీర బరువుని నియంత్రించుకోవచ్చు.

చెరకులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడంతో జీర్ణవ్యవస్థ మెరుగు పడి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి దోహదపడుతుంది. తద్వార శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. చెరకులో సుక్రోజ్ శాతం అధికంగా ఉండడంతో ఇది మన శరీరంలో కాలిన గాయాలను మాన్పించడానికి దోహదం చేస్తుంది.

ముఖం పై ఎర్పడిన మచ్చలను, మొటిమలను తగ్గించి ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే విధంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story