Summer : ఈ సారి సమ్మర్ హాట్ గురూ... వందేళ్ళలో ఎన్నడూలేని ఉష్ణోగ్రతలు

భారత వాతవారణంపై ఎల్‌నినో ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే భానుడు భగభగ లాడుతున్నాడు. మార్చిలోనే వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతవరణ శాఖ అంటోంది. 2022లో వందేళ్ళలో ఎన్నడూలేని ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ ఏడాది ఇంకా పెరగనున్నాయి ఉష్ణోగ్రతలు. ఇక ఏపీలో 70 ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు అప్పుడే 39 డిగ్రీలకు చేరాయి. అటు తీర ప్రాంత ప్రజల కష్టాలు తీవ్రంగా ఉండనున్నాయి.దీంతో దేశ వ్యాప్తంగా కరెంట్ వినియోగం భారీగా పెరగనుంది.వాతవరణంలో మార్పులతో గోధుములు, ఆహారధాన్యాల దిగుబడి తగ్గనుంది.భారత్‌లో ఉష్ణోగ్రతలపై వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ప్రత్యేక కథనంలో అనేక ఆసక్తికర అంశాలను తెలిపింది.
మరోవైపు 2023లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం ఎల్ నినో. మళ్లీ ఎల్ నినో ఎఫెక్ట్ అండబోతుంది.భారత్‌లో నైరుతి రుతుపవనాలపై ప్రభావం పడొచ్చన్నది అంచనా. గతంలో ఎల్ నినో కాలంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 80శాతం ఎల్ నినో పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంకంటే తక్కువ నమోదై అనేక చోట్ల కరవు పరిస్థితులు తలెత్తాయి. 2009లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు, మధ్య, ఉత్తర భారత్‌ల్లో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు పరిస్థితులు తలెత్తాయి.
వందేళ్ల చరిత్రలో ఇంతలా ఎండలు మండిపోవడం ఇదే తొలిసారి అంటున్నారు శాస్త్రవేత్తలు! ఇప్పటికే పెరుగుతున్న భూతాపం, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న సముద్ర ఉపరితలాన్ని ఈసారి ఎల్ నినో సంకేతాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్ధానికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com