Ice apples: వేసవిలో తాటి ముంజలు.. ఆరోగ్య ప్రయోజనాలు

Ice apples:ఐస్ యాపిల్ లేదా తాటి ముంజలు. ఎండాకాలంలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి. ఆకుల మధ్యలో ఉంచి అమ్ముతుంటారు. లేత తాటి ముంజలు ఎండ వేడిమి నుంచి కాపాడతాయి. శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా చూస్తుంది. ఈ ఐస్ యాపిల్‌లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇది వేసవి కాలంలో శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. ఇందులో బి విటమిన్లు, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
వేసవి కాలంలో శరీరానికి సహజసిద్ధమైన కూలింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. వేసవిలో వేడిని తట్టుకోవడానికి ఇది ఉత్తమమైన పండు.
బరువు తగ్గాలనుకునే వారు ముంజలు దొరికినన్నాళ్లు రోజూ తీసుకున్నా మంచిదే.. వీటిని తిన్నప్పుడు పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. త్వరగా ఆకలి అవదు.
ఇందులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
గర్భిణీ స్త్రీలు ఐస్ యాపిల్ తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా సంభవించే మలబద్ధకాన్ని నివారిస్తుంది.
వేసవిలో సాధారణంగా ఎక్కువ చెమట పట్టడం వల్ల చాలా అలసిపోతారు. తాటి ముంజలు అలసటని దూరం చేస్తాయి.
దీనిలో అధిక మొత్తంలో పొటాషియం శరీరంలోని టాక్సిన్స్‌ను శుభ్రపరుస్తుంది, కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది.
ఈసమ్మర్ ఫ్రూట్ తాటి ముంజల్లో తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. కాబట్టి లేతగా ఉన్న వాటిని ఎన్ని తీసుకున్నా ఇబ్బంది ఉందు. అయితే కొంచెం ముదురుగా ఉన్నా తినకపోవడమే మంచిది.
వేడికి ఒంటి మీద వచ్చే సెగ గడ్డల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఐస్ ఆపిల్ ఒంట్లో వేడిని దూరం చేస్తుంది.
ఐస్ యాపిల్స్ కణితులు, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇందులో ఉన్న ఫైటోకెమికల్స్ కణితుల పెరుగుదలను నియంత్రిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com