PUMPKIN SEEDS: గుమ్మడి గింజలతో గుండెపోటుకు చెక్..!

PUMPKIN SEEDS: గుమ్మడి గింజలతో గుండెపోటుకు చెక్..!
PUMPKIN SEEDS: గుమ్మడి గింజలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని తినడం ద్వారా గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

గుమ్మడి గింజల్లో బోలెడన్ని పోషకాలు ఉన్నాయని చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అందువల్ల మనలో చాలా మంది గుమ్మడి గింజలను తేలికగా తీసిపారేస్తుంటారు. తినడానికి కూడా ఇష్టపడరు. కానీ గుమ్మడి గింజల్లో కొవ్వు ఆమ్లాలు, పాస్ఫరస్, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ యాసిడ్ లు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా గుండెను పదిలంగా కాపాడడంలో గుమ్మడి కాయ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి.


గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నిక్షేపాలు, రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధించవచ్చు. ఇది కొరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. అందుకే మనం వీటిని ఆహారం ద్వారా శరీరానికి అందేలా చూసుకోవాలి. గుమ్మడి విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైటోస్టెరాల్స్, విటమిన్ ఈ ఉత్పన్నాలు, కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊబకాయం పెరగకుండా నిరోధించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిని తినడం ద్వారా గుండె సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

గుమ్మడి గింజలు క్యాన్సర్ నిరోధకాలుగా కూడా పనిచేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్‌లు రాకుండా కాపాడతాయి. అలాగే డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో కూడా గుమ్మడి గింజలు అద్భుత పాత్రను పోషిస్తాయి. గుమ్మడికాయ గింజలు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. తద్వారా చెక్కర వ్యాధిని మన దరికి చేరకుండా చూసుకోవచ్చు.

Tags

Next Story