బిడ్డకు డబ్బా పాలు పడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Precautions Bottle Milk

 Bottle Milk 

Precautions Bottle Milk: పోతపాలు బిడ్డకు మంచిది కాదు. పసిబిడ్డకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తుంటాయి. డబ్బా పాలు కంటే తల్లిపాలు ఎంతో మంచివి.

Precautions Bottle Milk: పసిపిల్లలకు చాలా మంది పోతపాలు పడుతుంటారు. పోతపాలు బిడ్డకు మంచిది కాదు. పసిబిడ్డకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తుంటాయి. డబ్బా పాలు కంటే తల్లిపాలు ఎంతో మంచివి. బిడ్డకు సాధ్యమైనంత వరకు తల్లిపాలే ఇవ్వాలి. బిడ్డకు తల్లి పాలు పట్టలేని పరిస్థితులలో ఉన్నప్పుడు పోత పాలు ఇవ్వాలి. అయితే డబ్బా రెండు రకాలుగా ఉంటాయి. డబ్బా పాల అంటే పాల పౌడర్‌ను ఉపయోగించి కలిసి ఇచ్చేవి. పశువుల పాలైనా.. డబ్బాపాలైనా బాటిల్ సహాయంతో ఇస్తారు. ఆస్పత్రిలో ఐతే సాధారణ కాన్పు అయిన గంటలోగా, ఆపరేషన్ కాన్పుల్లో ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా బిడ్డకు పాలు పట్టిస్తారు. అయితే సీసాతో పాలు ఇవ్వాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


ముందుగా సీసాను, పాల పీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు(ఏ పాలూ తల్లిపాలతో సమానం కాదు).ఆవు పాలల్లో కాల్షియమ్, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి చిన్న బిడ్డ కిడ్నీ మీద ప్రభావం చూపే ప్రమాదముంది.



పాల బాటిల్ కనీసం 10.నిమిషాల పాటు మరిగే నీళ్లలో ఉంచాలి. అలాగే పాల పీకను కనీసం 2 నుంచి 4 నిమిషాల పాటు వెడి నీళ్లలో మరగనివ్వాలి.


బిడ్డకు పాలు పట్టే సమయంలో సరైన విధంగా పట్టాలి. అంటే బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి. పాలు పట్టాక బిడ్డను వెంటనే పడుకోబెట్టకూడదు.


పాలు పట్టడం పూర్తి అవ్వగానే బిడ్డను భుజంపై వేసుకుని నెమ్మదిగా తట్టాలి. ఇలా తేన్పు వచ్చే వరకు బిడ్డను తట్టాలి.


పాల సీసాతో బిడ్డకు పాలు తాగించే సమయంలో ఒకసారి తాగాక మిగిలిన పాలను పారబోయాలి. అయితే బిడ్డ నిద్రపోయే సమయంలో పాలు తాగించకూడదు. పాలు పట్టే సీసాలు జాగ్రత్తగా స్టెరిలైజ్ చేసి వాడాలి. పాలూ నీళ్లూ సమ పాళాల్లో కలపాలి. డాక్టర్ సలహాతో బిడ్డకు ఏ పాలు మంచివో నిర్ణయించుకుని వాడాలి.


గమనిక : ఇవి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన వివరాలు. పూర్తి సమాచారం కావాలన్నా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా.. ఆరోగ్య నిపుణులు సంప్రదించండి.

Tags

Read MoreRead Less
Next Story